Rock Sugar: పటిక బెల్లంతో కంటి చూపును మెరుగుపరచుకోవడంతో పాటు.. మరెన్నో లాభాలు?
పటిక బెల్లం గురించి మనందరికీ తెలిసిందే. పటిక బెల్లాన్ని కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగిస్
- By Anshu Published Date - 04:13 PM, Fri - 12 May 23

పటిక బెల్లం గురించి మనందరికీ తెలిసిందే. పటిక బెల్లాన్ని కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పటిక బెల్లాన్ని ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్లో ఈ పట్టిక బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పటికబెల్లం ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న పదార్థాలు సక్రమంగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఈ పటిక బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే..
ఈ పటికబెల్లం తినడం వల్ల దగ్గ గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చల్లని వాతావరణం వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితుల నుండి తక్షణ ఉపశమనం కోసం ఔషధ గుణాలు, అవసరమైన పోషకాలను పటికబెల్లం కలిగి ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు పటికబెల్లం నల్ల మిరియాలు పొడి, నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. గొంతు నొప్పి నివారణకు రాత్రిపూట దీన్ని తినాలి. అలాగే ఒక గిన్నెలో పటికబెల్లం పౌడర్, నల్ల మిరియాలు పొడి తీసుకొని, ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలపాలి. దీన్ని తీసుకుంటే వేధించే దగ్గు తగ్గుతుంది. పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచతుంది.
తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు రక్తహీనత, కళ్లు తిరిగినట్లు ఉండడం, బలహీనత, సాధారణ అలసట వంటి సమస్యలను కలిగిస్తాయి. పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను పునరుత్పత్తి చేస్తుంది. పటికబెల్లం జీర్ణక్రియ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాయి. భోజనం తర్వాత పటిక బెల్లం కొన్ని నోట్లో వేసుకుంటే మంచిది. అలాగే పటికబెల్లం ముక్కులో రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. అలా జరిగినప్పుడు వెంటనే పటికబెల్లం కలిపిన నీటిని తీసుకుంటే రిలీఫ్ లభిస్తుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పటికబెల్లం ని కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెరుగుతుంది. అలాగే బాలింతలు పాలు పడక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పటికబెల్లం కలిపిన పాలు తీసుకుంటే పాలు పడడంతో పాటు యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ, తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు. పటికబెల్లం కంటి చూపుకి బాగా పని చేస్తుంది. భోజనం తరువాత పటికబెల్లం చిన్నముక్కను నోట్లో పెట్టుకుంటే కంటికి మంచిది.