Jeera Benefits: పోపు దినుసులలో ఒకటైన జీలకర్రతో వల్ల ఏకంగా అన్ని లాభాలా?
జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు. మరి జీలకర్ర వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:32 PM, Tue - 13 May 25

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఒకటైన జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వం నుంచే జీలకర్రను ఎన్నో ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. జీలకర్రను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను ఎక్కువగా పోపు గా మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుందట.
అయితే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే జీలకర్ర బెస్ట్ రెమిడీగా పనిచేస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. షుగర్ ఉన్నవారు జీలకర్రని తీసుకుంటే మంచిదట. టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుందట. ఇన్సులిన్ స్థాయిలు కూడా నియంత్రిస్తాయట. రక్తంలో చక్కెర లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చని, జీలకర్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది,ఇది అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
కాగా జీలకర్రని తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చట. ఒత్తిడిని తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుందని, జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని, జీలకర్రను తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవని చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుందట. జీలకర్రని తీసుకుంటే మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. జీలకర్ర నీరు మధుమేహం ఉన్నవారికి ఎంతో బాగా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయట. ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని తాగవచ్చని చెబుతున్నారు. జీలకర్ర నీరు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చట.