Almonds: బాదం పప్పుని పొట్టుతో తినాలా లేక పొట్టు లేకుండా తినాలా?
ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న బాదం పప్పుని పొట్టుతో తినాలా లేకుంటే పొట్టు లేకుండా తినాలా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:02 PM, Mon - 26 May 25

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికి తెలిసిందే. బాదంపప్పు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బాదంపప్పుని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. అయితే బాదం పప్పుని నేరుగా తినడంతో పాటు కొన్నిరకాల స్వీట్ల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే బాదంపప్పును ఒక చిన్న సందేహం నెలకొంటూ ఉంటుంది. ఏమిటంటే బాదంపప్పును పొట్టుతో తినాలా లేకుంటే పుట్టు లేకుండా తినాలా అని. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బాదం తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇది మెదడు ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి రెండింటికి చాలా మంచిదని చెబుతున్నారు. బాదంలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయట. అలాగే చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తాయట. అయితే పొట్టుతో ఉండే బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. కాబట్టి పొట్టుతో బాదం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.అలాగే పొట్టుతో ఉండే బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆక్సీకరణ నష్టాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతాయట. బాదంలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుందట. ఇది ని రంతర శక్తి కోసం ఇది ఒక మంటి ఎంపిక అని చెప్పవచ్చు.
అదేవిధంగా పొట్టుతో ఉండే బాదం తింటే కడుపు నిండుగా ఉంటుందట. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. బాదంను నానబెట్టి దాని పొట్టు తీసి తింటే సున్నితంగా ఉంటుందట. జీర్ణం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందట. నానబెట్టి పొట్టు తీసిన బాదం పోషకాలను గ్రహించడాన్ని పెంచుతుందట.ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. నానబెట్టి పొట్టు తీసిన బాదం మధుమేహాన్ని నియంత్రిస్తుందట. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందట. గుండె జబ్బులను నివారిస్తుందని మొత్తం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది మంచిది అన్న విషయానికి..బాదంను ఎలాగైనా తినవచ్చట. మీరు పొట్టుతో ఉండే బాదం తిన్నా సరే లేదా నానబెట్టి పొట్టు తీసి బాదం తిన్నా సరే ఇవి రెండూ మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివని ముఖ్యంగా మీ ఆకలిని తీరుస్తాయని చెబుతున్నారు.