Almonds: రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి.. ఎన్ని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసా?
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం పప్పులు రోజుల్లో ఎన్ని తీసుకోవాలి ఎంత తీసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Thu - 20 February 25

బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదంపప్పు తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వుకు, ఫైబర్, విటమిన్ లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందట. అలాగే ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందట.
అంతేకాకుండా క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలను కలిగించే బాదంపప్పును రోజులో ఎన్ని తినాలి అన్న విషయానికి వస్తే.. ఒక వ్యక్తి రోజుకు 30 నుంచి 50 గ్రాముల వరకు బాదం తింటే సరిపోతుందట. అంటే మీరు ఒక పిడికిలి లేదా 8 నుంచి 10 బాదం పప్పులు తినవచ్చని చెబుతున్నారు. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు 3 నుంచి 4 బాదం పప్పులు తినిపించవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా నాన బెట్టిన బాదం పప్పు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. సాధారణంగా 50 గ్రాముల బాదం పప్పులో దాదాపు 300 కేలరీలు, 150 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటాయట. బాదంపప్పును నేరుగా అయినా తినవచ్చని లేదంటే రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి తెల్లవారుజామున పొట్టు తీసేసి అయినా తినవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఈ బాదం పలుకులను ఏదైనా స్వీట్స్ రూపంలో లేదంటే పాలు తాగేటప్పుడు పొడిగా చేసుకుని అందులో వేసుకుని తాగవచ్చని చెబుతున్నారు. అయితే బాదం పలుకులు మంచివే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు.