Loose Motion: లూజ్ మోషన్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!
లూజ్ మోషన్ తో ఇబ్బంది పడుతున్న వారు ఈ రెమెడీస్ ని తప్పకుండా వినియోగించాల్సిందే అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:30 PM, Fri - 20 September 24

మామూలుగా మనం ఆహారం తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. దీంతో పదేపదే వాష్ రూమ్ కి పరిగెత్తాల్సి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉంటే పర్లేదు కానీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ లూస్ మోషన్స్ ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే లూజ్ మోషన్స్ తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ని ఫాలో అయితే వెంటనే తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండ్లలో పొటాషియం, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విరేచనాలను నివారించడానికి, ఎలక్ట్రోలైట్ల లోపాన్ని పోగొట్టడానికి సహాయపడతాయి. అలాగే అరటిపండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కడుపు కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి లూజ్ మోషన్స్ తో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే వెంటనే అరటి పండు తినడం మంచిది. అలాగే మీకు లూజ్ మోషన్ సమస్య ఉంటే.. బియ్య, పెసర పప్పుతో చేసిన కిచిడీ ని తినాలి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సులభంగా తయారు చేయగలిగే, త్వరగా జీర్ణమయ్యే వంటకం. ఇది మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందిస్తుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఈ కిచిడీ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు తరచూ దీన్ని తినడం మంచిదని చెబుతున్నారు. అలాగే విరేచనాలు ఉన్నప్పుడు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే శక్తి, కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. ఎందుకంటే అవి సులభంగా జీర్ణం అవుతాయి. అయినప్పటికీ వీటిని తయారు చేసేటప్పుడు ఎక్కువ నూనె లేదా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం మానుకోవాలనీ చెబుతున్నారు. అలాగే పెరుగులో కనిపించే ప్రోబయోటిక్స్ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
విరేచనాలు ఉన్నప్పుడు సాదా పెరుగును తినడం మంచిది. దీనిలో చక్కెర, ఉప్పు వంటివి మిక్స్ చేయకూడదని చెబుతున్నారు. దానిమ్మలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు విరేచనాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలాంటిప్పుడు మీరు దానిమ్మ గింజలు లేదా రసాలను తాగవచ్చట. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. ఇది సహజ ఎలక్ట్రోలైట్ కు గొప్ప మూలం. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.