HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >10 Health Benefits And Recipes Of Dragon Fruit

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తో ఆరోగ్య లాభాలెన్నో.. ప్రయోజనాలు కూడా..!

డ్రాగన్ ఫ్రూట్ మొక్కను హైలోసెరియస్ కాక్టస్ అని అంటారు. ఈ పండు పువ్వులు కేవలం రాత్రి పూటనే పూస్తాయి. ఈ పండును పిటాయా, పిటాహయ అని కూడా పిలుస్తారు.

  • Author : Gopi Date : 17-10-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Imgonline Com Ua Resize 7vkpwdzofvk 11zon
Imgonline Com Ua Resize 7vkpwdzofvk 11zon

డ్రాగన్ ఫ్రూట్ మొక్కను హైలోసెరియస్ కాక్టస్ అని అంటారు. ఈ పండు పువ్వులు కేవలం రాత్రి పూటనే పూస్తాయి. ఈ పండును పిటాయా, పిటాహయ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఆకారం డ్రాగన్ మాదిరిగా ఉందని డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ పండు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ పండు ఎక్సోటిక్ గా ఉన్నా ప్రస్తుతం ఇది ప్రపంచం మొత్తంలో అన్ని ప్రదేశాలలో దొరుకుతుంది.

ఈ పండులో ప్రస్తుతం రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఎర్ర తోలు కలిగి, లోపలి భాగంలో మాత్రం తెల్లని గుజ్జు, నల్ల గింజలు ఉంటాయి. వీటిలోనే కొన్ని ఎర్ర గుజ్జు, నల్లని విత్తనాలు కలిగి ఉంటాయి. ఇక రెండో వెరైటీలో పండు పైభాగం పసుపు రంగులో, పండు లోపలి గుజ్జు తెల్లగా, నల్లని విత్తనాలు ఉంటాయి. డ్రాగ‌న్ ఫ్రూట్ ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియాల‌లో పండుతుంది. డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్ లో మంచి పోషక విలువలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లను తగ్గించటంలో సహాయపడుతుంది. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. డ్రాగ‌న్ ఫ్రూట్స్ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఇన్ఫెక్ష‌న్ల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో క్యాన్స‌ర్ వ్యాధుల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. మన శరీరంలో ఐరన్ స్థాయిని పెంచటంలో సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో విట‌మిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రుస్తుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు పోతాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావు.ర‌క్త స‌ర‌ఫరా మెరుగుప‌డుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్ స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dragon Fruit
  • good for heart
  • health benefits
  • Health Fruit
  • Uses of Fruit

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd