HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Fact Check
  • >Fact Check Hyderabad Orr Has Multi Level Roads Flyover Through Building

Fact Check : హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌లోని బిల్డింగ్‌లో నుంచి భారీ ఫ్లై ఓవర్..!

మరొక AI డిటెక్షన్ టూల్ ‘సైట్ ఇంజిన్’‌లో(Fact Check) ఈ ఫొటోను తనిఖీ చేయగా.. వైరల్ అయిన ఫొటో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైందని వెల్లడైంది.  

  • Author : Pasha Date : 21-02-2025 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fact Check Hyderabad Orr Multi Level Roads Flyover Through Building Ai Image

Fact Checked By newsmeter

ప్రచారం : మల్టీ లెవల్ రోడ్లు, భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్,  ఎత్తైన భవనాల మధ్య జంక్షన్లతో ఒక  ఫొటో వైరల్ అవుతోంది. అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR ) ఫొటో అని ప్రచారం చేస్తున్నారు.

వాస్తవం : ఆ ప్రచారం తప్పు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఫొటో అని తేలింది.

Also Read :Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?

హైదరాబాద్  ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) అంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో మల్టీ లెవల్ రోడ్లు ఉన్నాయి. ఒక భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్ వెళ్తోంది. ఎత్తైన భవనాల చుట్టూ రోడ్ జంక్షన్లు  ఉన్నాయి. అది దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు అని సోషల్ మీడియా పోస్టులలో రాశారు. హైదరాబాద్‌లోని  ఆ రింగ్ రోడ్డు పొడవు 156 కిలోమీటర్లు అని ప్రస్తావించారు. ఈమేరకు వివరాలతో ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ చిత్రాన్ని షేర్ చేశారు . ( ఆర్కైవ్ )

ఇలాంటి వాదనలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు . ( ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2 )

వాస్తవ తనిఖీలో ఏం తేలిందంటే.. 

  • హైదరాబాద్ ఓఆర్ఆర్ పేరుతో వైరల్ అయిన ఫొటో నిజమైంది కాదని  ‘న్యూస్‌మీటర్’ గుర్తించింది. ఆ ప్రచారం తప్పు. ఎందుకంటే ఆ ఫొటోను ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (AI) ద్వారా జనరేట్ చేశారని తేలింది.
  • హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పొడవు  (ORR) పొడవు 158 కి.మీ. ఇది మనదేశంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే.
  • వైరల్ అయిన ఫొటోకు సంబంధించిన  కీవర్డ్‌లతో మేం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. దీంతో హైదరాబాద్ ORRకు చెందిన వివిధ ఫొటోలు, వీడియోలు వచ్చాయి. 2021 జూన్ 17న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నెహ్రూ ORR డ్రోన్ ఫుటేజీ మాకు దొరికింది. అందులో రౌండ్అబౌట్‌‌లు, బహుళ స్థాయి ట్రాఫిక్ మార్గాలు ఉన్నాయి.
  • తాజాగా వైరల్ అయిన హైదరాబాద్ ORR ఫొటో అనేది నిజమైన ఓఆర్ఆర్ ఫొటోతో సంబంధం లేని విధంగా ఉంది.
  • ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ కూడా భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్లు వెళ్లవు.
  • అందుకే హైదరాబాద్ ఓఆర్ఆర్ పేరుతో  వైరల్ అయిన ఫొటోను ఏఐతో తయారు చేసి ఉండొచ్చని అనుమానించాం.
  • మేం పలు ఏఐ ఫొటోలను పరిశీలించగా.. వైరల్ అయిన ఫొటో తరహాలోనే అసంపూర్తిగా ఉన్నాయి. రోడ్లు, జంక్షన్లు అకస్మాత్తుగా ముగిసి డెడ్ ఎండ్‌లకు దారితీశాయి. ట్రాఫిక్ ప్రవాహం దిశలో అసాధారణ సైజులున్న వాహనాలను వైరల్ ఫొటోలో గుర్తించాం.
  • ఏఐ (AI) డిటెక్షన్ టూల్ అయిన ‘హైవ్ మోడరేషన్‌’ను వాడుకొని .. సదరు వైరల్ ఫొటోను మేం చెక్ చేశాం. దీంతో ఆ ఫొటో 99.9 శాతం AI- జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ ఫొటో అని తేలింది.
  • మరొక AI డిటెక్షన్ టూల్ ‘సైట్ ఇంజిన్’‌లో(Fact Check) ఈ ఫొటోను తనిఖీ చేయగా.. వైరల్ అయిన ఫొటో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైందని వెల్లడైంది.

అందుకే.. వైరల్ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ తేల్చింది. AI ఫొటోను తయారు చేసి హైదరాబాద్ రింగ్ రోడ్ పేరుతో  ప్రచారం చేశారు.

Also Read :Health Insurance Vs Pollution : ఆరోగ్య బీమా పాలసీదారులకు బ్యాడ్ న్యూస్.. ఏమిటో తెలుసా?

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Image
  • Fact Check
  • Flyover Through Building
  • hyderabad
  • Hyderabad ORR
  • Multi Level Roads

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd