HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Fact Check
  • >Fact Check Has Rbi Announced The Launch Of Rs 5000 Notes Know Truth

Fact Check : రూ.5000 నోటును ఆర్‌బీఐ విడుదల చేసిందా ? నిజం ఏమిటి ?

రూ.5వేల కరెన్సీ నోటుకు(Fact Check) సంబంధించిన ప్రచారంపై ‘న్యూస్‌మీటర్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది.

  • Author : Pasha Date : 07-01-2025 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fact Check Rbi Rs 5000 Notes Reserve Bank Of India

Fact Checked By newsmeter

ప్రచారం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త 5000 రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేసింది.

వాస్తవం : ఈ ప్రచారం తప్పు. ఆర్బీఐ 5000 రూపాయల నోట్లను విడుదల చేయలేదు. దానిపై కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్‌బీఐ కానీ ప్రకటన విడుదల చేయలేదు.

Also Read :Finnish Woman : ఫిన్లాండ్‌ అమ్మాయి తెలుగులో ఎంత బాగా మాట్లాడుతోందో!

ఫేస్‌బుక్, ఎక్స్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘బిగ్ న్యూస్.. రూ.5000 కొత్త కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది.  ఈ సమాచారాన్ని ఆర్‌బీఐ అందించింది’’ అని ఆ పోస్టులో రాశారు.  ఫేస్‌బుక్ వినియోగదారు  చేసిన ఆ పోస్టును మీరు స్పష్టంగా చూడొచ్చు. రూ.5వేల కరెన్సీ నోటు అంటూ ఒక ఫొటోను కూడా ఆ పోస్టులో జతపరిచాడు.

Also Read :What is Bharatpol : ‘భారత్ పోల్’ విడుదల.. రాష్ట్రాల పోలీసు విభాగాలకు గుడ్ న్యూస్

ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది ?

  • రూ.5వేల కరెన్సీ నోటుకు(Fact Check) సంబంధించిన ప్రచారంపై ‘న్యూస్‌మీటర్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీంతో అది తప్పుడు ప్రచారమని తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నోటును విడుదల చేయలేదని స్పష్టమైంది. వైరల్ అయిన సదరు ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉన్న సమాచారమంతా అబద్ధమని బట్టబయలైంది.
  • ఈ నిజాన్ని గుర్తించే క్రమంలో మేం  గూగుల్‌లో  ‘రూ.5వేల కరెన్సీ నోటు’ అనే పదాలను ఇంగ్లిష్ భాషలో సెర్చ్ చేశాం. రూ.5వేల నోటుపై ఆర్‌బీఐ  ప్రకటన చేసినట్టుగా ఒక్క వార్త కానీ, రిపోర్ట్ కానీ మాకు దొరకలేదు. ఆ సమాచారంతో కూడిన ఆర్‌బీఐ అధికారిక సర్క్యులర్‌లు కూడా రిలీజ్ కాలేదని మా ఫ్యాక్ట్ చెక్‌లో గుర్తించాం.
  • మేం RBI అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేశాం. అందులో కూడా రూ.5000 కరెన్సీ నోటు విడుదలపై అధికారిక నోటిఫికేషన్ కానీ, అప్‌డేట్ కానీ కనిపించలేదు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఇచ్చిన కొత్త అప్‌డేట్లలో 2016లో జరిగిన డీమోనిటైజేషన్ గురించి ప్రస్తావన ఉంది.  డీమోనిటైజేషన్‌లో భాగంగా రూ.2వేల నోట్లను రద్దు చేశారు. ప్రస్తుతం  మన దేశంలో 10, 20, 50, 100, 200, 500 రూపాయల కరెన్సీ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి.
  • కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగమైన ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) సైతం రూ.5వేల నోటుపై జరిగిన ప్రచారాన్ని ఖండించింది. ఆ నోటును ఆర్‌బీఐ విడుదల చేసిందని, విడుదల చేయనుందని జరిగిన ప్రచారమంతా తప్పేనని వెల్లడించింది. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని పీఐబీ తేల్చి చెప్పింది.
  • పై అన్ని అంశాల ఆధారంగా ఆర్‌బీఐ రూ.5000 నోట్లను విడుదల చేసిందంటూ వైరల్ సోషల్ మీడియా పోస్టులన్నీ అబద్ధాలే అని మేం తేల్చాం. ప్రభుత్వం కానీ, ఆర్బీఐ కానీ దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

सतर्क रहें ⚠️

सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck

✅ यह दावा फर्जी है

✅ @RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है

✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/WejSLtVo5O पर विजिट करें pic.twitter.com/CWTBocG62m

— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2025

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fact Check
  • rbi
  • reserve bank of india'
  • Rs 5000 Notes
  • Shakti Collective

Related News

SMS From 127000

SMS From 127000: మీ మొబైల్‌కు 127000 నంబర్ నుండి SMS వచ్చిందా? కారణం ఏంటంటే!

దీని కోసం మొబైల్ నంబర్‌కు పంపబడుతున్న మెసేజ్‌లో హెచ్చరిక సందేశంతో పాటు ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఈ లింక్ యూజర్‌ను కన్సెంట్ మేనేజ్‌మెంట్ పేజీకి తీసుకువెళుతుంది.

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd