Wednesday: బుధవారం ఈ రెండు వస్తువులను దానం చేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ దూరం?
విఘ్నేశ్వరుడు.. హిందువులు ఎటువంటి పని మొదలుపెట్టిన కూడా మొదట విగ్నేశ్వరున్ని పూజిస్తూ ఉంటారు. వారంలో
- By Anshu Published Date - 06:00 AM, Wed - 16 November 22

విఘ్నేశ్వరుడు.. హిందువులు ఎటువంటి పని మొదలుపెట్టిన కూడా మొదట విగ్నేశ్వరున్ని పూజిస్తూ ఉంటారు. వారంలో బుధవారం రోజున గణేశునికి అంకితం చేస్తూ ఉంటారు. బుధవారం రోజున గణపతికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బుధవారం రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనుకున్న పనులను నెరవేరుతాయి అని నమ్మకం. అంతే కాకుండా చేపట్టిన కార్యక్రమాలు విజయం అవ్వడంతో పాటు గణపతి ప్రసన్నుడు అవుతాడు అని విశ్వసిస్తూ ఉంటారు.
అయితే బుధవారం వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజ చేయడంతో పాటు రెండు రకాల వస్తువులను దానం చేయడం వల్ల మీకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మరి ఎటువంటి వస్తువులను బుధవారం రోజు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..బుధవారం రోజు ఆకుపచ్చ ఒలిచిన పెసలు తినటం,దానం చేయటం ఉత్తమం వల్ల బుధ గ్రహం బలంగా మారి డబ్బు కొలత సమస్య ఏర్పడదు. బుధవారం రోజు ప్రత్యేక గణేశ పూజ చేసి స్వామికి ఇష్టమైన లడ్డూను సమర్పించాలి. అలాగే బుధవారం రోజు ఆవుకు పచ్చ గడ్డి తినిపించండి.
ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వినాయకుడికి పసుపు పుష్పం చాలా ఇష్టం. వినాయకుడు పూజలో పసుపు పువ్వులు సమర్పించడం మరింత మంచిది. బుధవారం రోజున కొంతమంది హిజ్రాలకు డబ్బులు దానం చేయాలి. అలంకరణ వస్తువులను కూడా దానం చేయవచ్చు. ఈ రెండు వస్తువులను దానం చేయడం వల్ల మీరు అనుకున్నది ఆ విగ్నేశ్వరుడు నెరవేరుస్తాడు. అయితే బుధవారం రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించినా కూడా ఫలితాలు కనిపించలేదు అని చింతించకండి. నియమానుసారం వినాయకుడికి పూజలు చేయడం వల్ల అన్ని ఆటంకాలు నిదానంగా తొలగిపోతాయి. బుధవారం రోజు విఘ్నేశ్వరుడు దేవాలయానికి వెళ్లి పసుపు పువ్వులు లేదంటే మోదకం లేదంటే లడ్డూను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల విజ్ఞేశ్వరుడు ప్రసన్నుడే మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు.