HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Worship Lord Ganesh On Wednesday You Will Get Many Benefits

Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

Wednesday: ప్రతి బుధవారం రోజున విజ్ఞాలకు అధిపతి అయిన విగ్నేశ్వరుడిని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ‎

  • Author : Anshu Date : 21-10-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganesh House
Ganesh House

Wednesday: మనం ఎలాంటి శుభాకార్యం మొదలు పెట్టినా మొదటి పూజించేది విఘ్నేశ్వరుడిని. ఆయనకు పూజ చేసిన తర్వాతనే శుభకార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విజ్ఞంగా జరగాలని కోరుకుంటూ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే వారంలో బుధవారం రోజు విగ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజు గణేష్ ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే మనం చేసే పనిలో కూడా విజయం లభిస్తుందని నమ్మకం. ఇకపోతే బుధవారం బుధ గ్రహానికి చెందినది.

‎అలాగే గణేశుడి రోజుగా కూడా పరిగణిస్తారు. బలహీన జ్ఞాపకశక్తి లేదా అస్థిర మనస్సు ఉన్న వ్యక్తులు ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. కాగా గణేశునికి తీపి అంటే చాలా ఇష్టం. మోదక్ , బెల్లం అంటే మరీ ఇష్టం. కాబట్టి ఈ రోజున గణేశుడి గుడికి వెళ్లి బెల్లం ,మోదక్ సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటూ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. హిందూ ధర్మ పూజలో గణపతి పూజలో దూర్వ సమర్పించడం చాలా శ్రేయస్కరం. బుధవారం నాడు గణేశునికి 21 దూర్వ సమర్పించడం శుభప్రదం అని చెబుతున్నారు.

‎బుధవారం నాడు గణేశుడితో పాటు దుర్గామాతను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. బుధ దోషం నుంచి విముక్తి పొందడానికి “ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలట. అలాగే ” ఓం గం గణపతయే నమః” లేదా ” శ్రీ గణేశాయ నమః ” అని క్రమం తప్పకుండా జపించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్ని తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే బుధవారం రోజు పెసరపప్పు, రాగి పాత్రలను హిజ్రాలకు దానం చేయడం చాలా శుభ ఫలితాలను అందిస్తుందట.

‎బుధవారం నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా పరిగణించబడుతుందట. ఎందుకంటే ఇది ప్రతికూలతను పెంచుతుందని, దీనికి విరుద్ధంగా, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి చిహ్నం. దీనిని ధరించడం వల్ల మనస్సులో సమతుల్యత సానుకూల శక్తి ప్రసరిస్తుందని పండితులు చెబుతున్నారు.

‎


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ganesh
  • spiritual
  • sports
  • wednesday
  • Wednesday pooja

Related News

Messi makes history with his 200th goal.

FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

లియోనెల్ మెస్సీ.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులకు కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో భరిస్తూ, భావోద్వేగాలను పూర్తి కంట్రోల్‌లో ఉంచుకోగలరు కాబట్టే ఆయన ఆ స్థాయికి చేరారు. అయితే, ఎంతటి దిగ్గజమైనా మనిషే కదా! మంగళవారం అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ తొలి గోల్ కొట్టిన వెంటనే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రప

    Latest News

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd