Women: స్త్రీలు పొరపాటున కూడా ఈ పనులు అసలు చేయకూడదట.. చేశారో అంతే సంగతులు!
నిత్య జీవితంలో స్త్రీలు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు..
- By Anshu Published Date - 04:03 PM, Thu - 19 December 24

మామూలుగా స్త్రీ పురుషులు జీవితంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణం కావచ్చు. ఇది నమ్మలేని నిజం. కానీ చాలామంది ఈ విషయాన్ని తేలికగా కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే మామూలుగా స్త్రీలు పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయట. వాటిని చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరి స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు కంటి పుసులు తీయకుండా ఏ పని చేయకూడదట. వీలైతే స్నానం చేయడం లేదంటే ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే మిగతా పనులు మొదలు పెట్టడం మంచిది. లేదంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. అలాగే స్త్రీలు రాత్రిపూట కుడివైపు నిద్రపోకూడదట. ఇలా పడుకుంటే భూతగాలి ఆవశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఉదయం వంట చేసేముందు వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాతనే ఆ పనులు మొదలు పెట్టాలట. మెడలో తాళికి పసుపు రాయకుండా ఉండకూడదట. అలాగే తాళిని మెడలో నుండి తీయకూడదని చెబుతున్నారు.
నిత్య దీపారాధన ఉన్నవాళ్లు పూజ చేయకుండా అసలు ఉండకూడదట. ఒకవేళ స్త్రీలు చేయలేని రోజుల్లో భర్తతో అయినా చేయించాలని చెబుతున్నారు. పడక గదిలో భర్తను కాదు అనకూడదట. ఎప్పుడు కూడా ఇంటి ఇల్లాలు అలిగి చీటికిమాటికి కన్నీరు పెట్టకూడదట. అలాగే స్త్రీలు సాయంత్రం దీపం పెట్టిన తర్వాత పొరపాటున కూడా ఇల్లు ఊడ్చకూడదని, ఒకవేళ ఊడ్చాల్సి వచ్చిన ఆ చెత్తను తీసి పారేయకుండా అలాగే ఒక చోట నూకి పెట్టాలని చెబుతున్నారు.