HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Should Women Wear Kumkum What Do The Puranas Say

Kumkuma Bottu: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

  • Author : Vamsi Chowdary Korata Date : 25-05-2026 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Why should women wear Kumkum? What do the Puranas say?
Why should women wear Kumkum? What do the Puranas say?

హిందువులు పసుపు, కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన స్త్రీలు నుదుటున కుంకుమ ధరించారంటే ఆమెకు పెళ్లయిందని, భర్త ఉన్నాడని అర్థం. అందుకే పెళ్లయిన స్త్రీలు తప్పకుండా నుదుటున కుంకుమను ధరిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ ధరించాలని సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి ఆజ్ఞాపించిందని మన పురాణాలు చెబుతున్నాయి.

అయితే పెళ్లి కాని అమ్మాయిలు నుదుటున కుంకుమ ధరించరు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన స్త్రీలు మొత్తం 5 స్థానాలలో కుంకుమను ధరిస్తారు. మరి స్త్రీలు కుంకుమ ధరించే ఆ ఐదు స్థానాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి, దానిపై పాపిడిబిళ్ళను ధరించేదట. అయితే ఆంజనేయస్వామి ‘ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు?’ అని అడిగితే, ‘నా స్వామి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని’ చెప్పిందట.

స్వామి తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. అలాగే కనుబొమల మధ్యన కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరగడంతో పాటుగా నిత్య సుమంగళిగా ఉంటారట. అలాగే కంఠం దగ్గర, వక్షస్థలం మధ్యన ఇంకా నాభి దగ్గర కూడా కుంకుమను ధరిస్తారు. అయితే ఈ అయిదు చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యం లేకుండా, భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్లిపోవడానికి దోహదపడతాయట. అయితే సీతాదేవి కూడా ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kumkum
  • kumkum speciality
  • kumkuma bottu
  • kumkuma significance
  • women kumkuma

Related News

    Latest News

    • Metro Rail: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట

    • Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

    • Kumkuma Bottu: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

    • Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

    • Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd