Shiva Temple: శివాలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా ఎవరినీ దర్శించుకోవాలి.. నవగ్రహ దర్శనమా లేక శివ దర్శనమా!
శివాలయాలకు వెళ్లినప్పుడు మొదటగా నవగ్రహాలు లేదా శివుడు ఎవరిని దర్శించుకోవాలి అన్న విషయాల గురించి తెలిపారు.
- Author : Anshu
Date : 16-09-2024 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
హిందువులు ఎక్కువ శాతం మంది కొలిచే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు. ఈ పరమేశ్వరుని సోమవారం రోజుతో పాటు అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కూడా కొలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయా రోజుల్లో శివాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. అయితే మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా అక్కడ నవగ్రహాలు ఉండడం అన్నది తప్పనిసరి. అది శివాలయాలు ఎక్కువ లేనప్పుడు చాలామందికి కలిగే ఒక పెద్ద సందేశం ముందుగా శివుడిని దర్శనం చేసుకోవాలా? లేకుంటే నవగ్రహాలను దర్శనం చేసుకోవాలా? మనలో చాలామందికి ఈ సందేహం కలిగే ఉంటుంది.
కానీ ఈ విషయంలో చాలామంది ముందు వెనుకతో కొన్ని చిన్న చిన్న పొరపాటు చేస్తుంటారు. మరి శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజ చేసినా చేయకున్నా, శివునికి మాత్రం కచ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు. అలా చేస్తే నవగ్రహ దోషాలు ఉంటే పోతాయని భక్తుల విశ్వాసం. అయితే శివాలయం కాకుండా కొన్ని ఇతర ఆలయాల్లోనూ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఏ ఆలయంలో నవగ్రహ మండపాలు ఉన్నా చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం.
అలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని చెబుతున్నారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలను ముందుగా దర్శించాలా లేదా ఆ పరమ శివుడిని ముందుగా దర్శించాల అన్న సందేహం చాలా మందిలో ఉంది. శివాలయంలో నవగ్రహాలను చూసిన వెంటనే మొదట ఆ పరమశివుడి వద్దకు వెళ్లాలా లేదా నవగ్రహారాధన చేయాలన్నా అన్న సందిగ్ధిత ఉంటుంది.
పరమేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు. కర్తవ్వాన్ని బోధించేది శివుడు. ముందుగా శివున్ని దర్శించుకోవాలి. లేదా నవగ్రహాలను దర్శించినా..ఆ పరమ శివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనం ఏ ఆలయంలో అయినా సరే మొదటగా ఆలయ ప్రధాన దేవుడిని దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా లేదంటే ముందుగా అయినా కూడా నవగ్రహాలను దర్శించడం పండితులు చెబుతున్నారు.