Spirituality: మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో తెలుసా?
మాంసాహారం తిని దేవాలయాలకు అస్సలు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:03 PM, Sun - 15 September 24

మామూలుగా మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. అయితే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి మంచి దుస్తులు ధరించి స్వామివారికి ప్రసాదాలను నైవేద్యంగా తీసుకొని వెళ్తూ ఉంటాం. కొంతమంది గ్రామ దేవతలకు మేక పోటీలు కోళ్లు వంటివి బలి ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత వారిని అక్కడే చేసుకుని వండుకుని తింటూ ఉంటారు. అంతేకానీ ఎప్పుడూ కూడా మాంసాహారం తీసుకున్న తర్వాత ఆలయానికి భక్తులు వెళ్ళరు. అలా వెళ్తే పాపమని దేవుళ్ళు కోప్పడతారని అంటూ ఉంటారు. నిజానికి మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లేముందు మాంసాహారం ముట్టుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసాహారం కామ, వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే రజో గుణం ఆవహిస్తుందని, ఈ గుణాలు ఉండటం వల్ల సత్వ గుణం తగ్గిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అందుకే సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం. మాంసాహారం తీసుకుంటే ఏర్పడే రజోగుణ, తమోగుణాల ప్రభావం వల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా దైవారాధన సఫలం కాదని పెద్దలంటారు.
అలా మాంసాహారం తినే గుడికి వెళ్లడం వల్ల దైవదర్శనం చేసుకున్నప్పటికీ ఆ ఫలితం కలగదు అని చెబుతుంటారు. అలాగే గుడ్డు మాంసాహారాల్లోనే కాకుండా, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా తీసుకోకూడదట. అందుకే మాంసాహారం కంటే సాత్విక ఆహారం అనగా పాలు, పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే గుడ్డు, మాంసా హారాల్లోనే కాకుండా, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులతో కూడా తమో, రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్లే సమయంలోనూ దైవ కార్యాలు చేసే సమయంలోనూ రజో గుణాలు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.
అలాగే కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారం తీసుకుని వెళ్లవచ్చు. అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.