HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Why Do You Go With Gomata At The Time Of Housewarming Know

Housewarming: గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు.. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అన్నది కల. సొంతింటి కల నెరవేర్చుకోడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అనుకున్న విధంగానే సొంత ఇల్లు కట్టించుకున్న తర్

  • By Anshu Published Date - 10:10 PM, Thu - 8 June 23
  • daily-hunt
Housewarming
Housewarming

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అన్నది కల. సొంతింటి కల నెరవేర్చుకోడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అనుకున్న విధంగానే సొంత ఇల్లు కట్టించుకున్న తర్వాత బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వారంతా అన్ని పిలిచి పూజలు వ్రతాలు చేసి ఇంట్లో పాలు పొంగించి ఇంట్లోకి చేరుతుంటారు. అయితే గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్లేముందు ముందుగా గోమాతని తీసుకెళ్తూ ఉంటారు. ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని తన ధర్మపత్నితో సహా దేవుడి ఫొటో పట్టుకుని లోపలకు అడుగుపెడతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా లోపలకు వెళతారు.

పూర్వీకుల నుంచి ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇంతకీ గృహప్రవేశానికి గోమాతకి సంబంధం ఏంటి అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే గోమాతని సకల దేవత స్వరూపంగా భావిస్తారు. అందుకే ముందుగా గోవులను కొత్తింట్లోకి తీసుకెళ్లడం ద్వారా సకలదేవతలు ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టే అని విశ్వసిస్తారు. నూతన గృహంలో మూత్రం, పేడ వేసినట్టైతే మరింత శుభకరంగా భావిస్తారు. అయితే అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు కానీ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ ఆచారం పేరుతో ఆవులను ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

మెట్లు ఎక్కించి , హింసించి మరీ తమ కొత్తింట్లో అడుగుపెట్టిస్తున్నారు. కానీ దీనికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఉందంటున్నారు పండితులు. బహుళ అంతస్తులున్న భవనాల్లోకి ఆవును తీసుకు రావడం కుదరదు కాబట్టి, బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసే వాళ్లు ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడంతో పాటూ వాటి యజమానులను దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం గోవు మూత్రాన్ని, పేడను తీసుకెళ్లి తమ నివాస స్థలాన్ని శుద్ధి చేస్తే సకలదేవతలు వచ్చినట్టే అని చెబుతారు. అంతేకానీ సెంటిమెంట్ పేరుతో గోమాతను బహుళ అంతస్థుల భవనాలు ఎక్కించి ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇది కేవలం అపార్ట్స్ మెంట్స్ వారికి మాత్రమే. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ, ఇన్ఫెక్షన్లూ, దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడ, మూత్రం, నెయ్యీ, పెరుగూ, పాలు అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని వ్యర్థాలను పారదోలుతుంది. అందుకే గృహప్రవేశం సమయంలో ఆవుకి అంత ప్రాధాన్యతనిస్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cow
  • gomata
  • house open
  • Housewarming

Related News

    Latest News

    • CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

    • GST Reform: గుడ్ న్యూస్‌.. ఈ వ‌స్తువుల‌పై భారీగా త‌గ్గిన ధ‌ర‌లు!

    • RK Roja : షూటింగ్లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది – పవన్ పై రోజా ఫైర్

    • H3N2 Alert: దేశంలో మ‌రో స‌రికొత్త‌ వైర‌స్ విజృంభ‌ణ‌.. ల‌క్ష‌ణాలివే?!

    • India-Pak Match: భార‌త్‌- పాకిస్థాన్ మ్యాచ్ ర‌ద్దు అవుతుందా?

    Trending News

      • Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?

      • Jersey Sponsorship: టీమిండియా కొత్త‌ జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

      • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

      • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

      • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd