Spirituality: మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలంటే ఈ దీపాలు వెలిగించాల్సిందే!
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే దీపావళి రోజు ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 01:40 PM, Thu - 10 October 24

హిందువులు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈ దీపావళి పండుగను అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద కుల మత అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగకు కొత్త బట్టలు ధరించడం పిండి వంటలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే టపాసులు పేల్చడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఈ దీపావళి పండుగకు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఇంటిని మొత్తం దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. దీపావళి నాడు మహాలక్ష్మీ విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది.
అలా విహారం చేయడానికి బయలు దేరిన లక్ష్మీ దేవి ఏ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట. అప్పటి నుంచీ దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించడం ప్రారంభించారు. లక్ష్మీ దేవి తనవాహనమైన గుడ్ల గూబ ఎక్కి, సూర్యాస్తమయ సమయం, అనగా సాయం సద్య లేక ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకూ సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణపురాణంలో ఉంది. అయితే దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు.
అయితే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారు జామునే లేచి తులసి కోట దగ్గర దీపం పెట్టడం మంచిదట. తులసి పూజ అయినాక, కృత్తిక నక్షత్ర దర్శనం చేయాలంటారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఈ దీపావళి పండుగ రోజున ఇంటిని మొత్తం దీపాలతో చక్కగా అలంకరించుకోవాలని చెబుతున్నారు.