Incense Sticks: అగరబత్తులు వెలిగించడం వెన్నుకున్న అసలు రహస్యం ఏమిటంటే?
సాధారణంగా మనం పూజ చేసే సమయంలో అగరబత్తులని వెలిగించడం అనేది సర్వసాధారణమైన విషయమే. అయితే
- Author : Anshu
Date : 25-07-2022 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా మనం పూజ చేసే సమయంలో అగరబత్తులని వెలిగించడం అనేది సర్వసాధారణమైన విషయమే. అయితే ఇలా పూజ చేసినప్పుడు అగరబత్తులను వెలిగించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. ఇకపోతే పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది మొత్తం సువాసన ఆవరిస్తుంది. అంతేకాకుండా పురాణాల్లో వినియోగించే అగరబత్తులలో ఎక్కువ శాతం ఔషధ పదార్థాలు ఉండేవి.
అలాగే పూజల ఉపయోగించి సాంబ్రాణిని బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి తయారుచేస్తారు. దీని నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుంది. చర్మం కింద మృదుస్పర్శకు అవసరమైన స్రావాలను ఈ ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. గుగ్గిలం గురించి అథర్వణ వేదంలోనూ వివరించారు. గుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా దీన్ని తయారుచేస్తారు.
ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించే గుణాలను కూడా కలిగి ఉంటుంది. వీటితో తయారుచేసిన అగరవత్తులను వెలిగించినప్పుడు గాలిలో కలుషితాన్ని శుద్ధిచేస్తుంది. అగరవత్తులు మండుతున్నప్పుడు వెలువడే తాజా సువాసన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత కూడా కలుగుతుంది. అందుకే పూజలో అగరబత్తులను తప్పనిసరిగా వెలిగిస్తారు.