HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Which Flower Does Lord Shiva Likes Mostly 2

Lord Shiva: పరమేశ్వరుడికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకంత ఇష్టం.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!

పరమేశ్వరుడికి ఇష్టమైన పూలలో తుమ్మి పువ్వులు కూడా ఒకటి. బోలా శంకరుడికి ఈ తుమ్మి పువ్వులు అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 03-01-2025 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Shiva
Lord Shiva

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. కోరిన కోరికలను తీర్చే దేవుడు ఆ భోళా శంకరుడు. ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్ళతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టికి ఆది దంపతులు పార్వీ పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ వుంటాము. పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టిపరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు. ఒక వేల సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వస్తుందట.

వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి గన్నేరు పుష్పాన్ని శివసహస్రనామం చదివి శివలింగంపైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అలాగే ఒక బిల్వపత్రాన్ని శివలింగంపైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించివేస్తాడట. వెయ్యి బిల్వదలాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామరపువ్వును శివలింగపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అదేవిదంగా వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్తు పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది.

వెయ్యి జమ్మి పువ్వులు శివలింగం పై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రతీకరము. మారేడు పువ్వుకంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనేదానిపై శివపురాణంలో ఒక కథ వుంది. పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తుంటాడు. అతనికి శివుడంటే భక్తి. మార్గ మధ్యలో చలిఎక్కువగా వుండడం వల్ల ఆగిపోతాడు. అక్కడ శివలింగం వుంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర వున్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు. మధ్యలో మేలుకవ వచ్చి చలివల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడూ శివుడి పైన వుండాలని కోరుతాడు, అంటే శివుడి పాదాలు తనపైన వుండాలని సరిగ్గా అడకకుండా తప్పుగా అడుగుతాడు.

అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి, పాదాల రూపంలో వుండి ఎప్పుడూ తనపై వుండేలా కోరికను ప్రసాదిస్తాడు.అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో వుంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి ఎన్ని పువ్వులతో పూజచేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మరిచిపోవద్దు. కార్తికమాసంలో శివుడిని తుమ్మి పువ్వులతో పూజచేయడం చాలా శుభప్రదం. శివపూజలో పొపాటున కూడా బంతి పూలను వాడకూడదు. మొగలిపువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు. ఎవరైతే మొగలి పువ్వులతో అర్పిస్తారో వారు జీవితంలో అష్టకష్టాలను అనుభవిస్తారట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhola Shankar
  • Lord Shiva
  • parameswara
  • pooja

Related News

To get relief from the affliction caused by Saturn, one must offer a specific item to Lord Saneeswara!

Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

మామూలుగా శని దేవుడిని కర్మధాత అని పిలుస్తుంటారు. అంటే మనం చేసే మంచి చెడుల బట్టి ఫలితాలను ఇస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను అందించడంతో పాటు ఆయన అనుగ్రహం కలుగుతుందట. చెడు పనులు చేస్తూ, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడే వారిని ఆయన కష్టాలకు గురి చేస్తాడట. అలా మంచి చెడులను కలిపి ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శని దేవుడు జాతకంలో అశుభ స్

  • Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

    Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

    Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd