ఇంట్లో కుక్కని పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!
ఇంట్లో కుక్కలని పెంచుకునే వారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలని, ముఖ్యంగా నల్ల రంగు కుక్క పెంచుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 16-12-2025 - 6:07 IST
Published By : Hashtagu Telugu Desk
- ఇంట్లో ఏ రంగు కుక్కలను పెంచుకోవాలి.
- కుక్కలు గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తాయా?
- ఎలాంటి రంగు కుక్క పెంచుకోవడం శ్రేయస్కరం
Astrology: మామూలుగా మనం ఇంట్లో అనేక రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటాం. వాటిలో కుక్క మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మంది ఇంట్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంకొందరు పిల్లులు వంటివి పెంచుకుంటూ ఉంటారు. అయితే కుక్కలలో ఎన్నో రకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. రంగురంగుల కుక్కలతో పాటు రకరకాల కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలను చాలామంది అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు.
కుక్క అంటే కాలభైరవ దేవుడితో సమానం అని నమ్ముతూ ఉంటారు. అయితే ఇంట్లో కుక్కలను పెంచుకునేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలని, ముఖ్యంగా ఏ రంగు కుక్కలు పెంచుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి అన్న విషయం తెలుసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. కాగా కుక్కలను పెంచుకోవడం చాలామందికి ఒక అభిరుచి లేదా ప్రేమ కావచ్చు. కాని జ్యోతిషశాస్త్రంలో దాని శుభ ఫలితాల గురించి నేటికీ చాలా మందికి తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కలను పెంచుకోవడం ద్వారా అనేక గ్రహాల అశుభ ప్రభావాన్ని తగ్గించవచ్చట. హిందూ ధర్మంలో కుక్కను కాల భైరవుని వాహనంగా భావిస్తారు. జ్యోతిష్యంలో కుక్క శని, రాహు, కేతు గ్రహాలకు కూడా సంబంధించినది.
ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల ఈ మూడు గ్రహాల అశుభత్వం తొలగిపోతుందట. అయితే తెల్ల రంగు కుక్కను పెంచుకోవడం వల్ల రాహు,కేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చట. ఆగిపోయిన పనులను చక్కదిద్దడానికి సహాయపడుతుందట. నల్ల కుక్కను పెంచుకోవడం శని దేవుడిని సంతోషపెట్టడానికి ఉత్తమ మార్గం అని చెబుతారు. ముఖ్యంగా శని ప్రభావం నడుస్తున్న వారు నల్ల కుక్కకు ఆహారం ఇవ్వాలని, నల్ల కుక్క చెడు శక్తులు, ప్రతికూల శక్తి బ్లాక్ మ్యాజిక్ ప్రభావం నుంచి దూరం చేస్తుందని చెబుతున్నారు. ఇక గోధుమ రంగు కుక్కను పెంచుకోవడం న్యాయపరమైన వివాదాలు లేదా తగాదాలలో చిక్కుకున్న వారికి శుభప్రదం అని చెబుతున్నారు. ఇది జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుందని, వివాదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు.