HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄When Is Nirjala Ekadashi 2023 Know Auspicious Time Worship Method And Importance

Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం

ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)..  అత్యంత పవిత్రమైనది.

  • By pasha Published Date - 01:41 PM, Tue - 23 May 23
  • daily-hunt
Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం

ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)..  అత్యంత పవిత్రమైనది. ఈ వ్రతం పాటించే వారు చుక్క నీరు కూడా తీసుకోరు. వ్రతం చేపట్టిన రోజున సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు తాగరు. అందుకే దానికి నిర్జల ఏకాదశి (Nirjala Ekadashi 2023)  అనే పేరు వచ్చింది.  ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈసారి నిర్జల ఏకాదశి వ్రతాన్ని మే 31న(బుధవారం)  పాటిస్తారు. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు. దీనిని భీమసేన్  ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసం వల్ల దీర్ఘాయుష్షు, మోక్షం లభిస్తాయి. 

శుభ ముహూర్తం 

నిర్జల ఏకాదశి తిథి మే 30న మధ్యాహ్నం 01:07 గంటలకు ప్రారంభమై మే 31న  మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. సర్వార్థ సిద్ధి యోగ సమయం మే 31న ఉదయం 05.24 నుంచి 06.00 గంటల వరకు ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని  జూన్ 01 న ఉదయం 05.24 నుంచి 08.10 మధ్య విష్ణుమూర్తికి పూజ చేసి ముగిస్తారు. 

పూజా విధానం 

నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీని తరువాత పసుపు బట్టలు ధరించి విష్ణువును పూజించి..  ఉపవాస వ్రతం చేయాలి. విష్ణువుకు పసుపు పువ్వులు, పంచామృతం, తులసీ దళాన్ని సమర్పించాలి. విష్ణువు, లక్ష్మిదేవి  మంత్రాలను జపించండి. ఉపవాస వ్రతం చేసిన తర్వాత, మరుసటి రోజున  సూర్యోదయం వరకు చుక్క నీరు కూడా తీసుకోవద్దు. ఆహారం, పండ్లు కూడా వ్రతం  పాటించే వారు తినకూడదు. మరుసటి రోజు అంటే.. ద్వాదశి తిథి నాడు స్నానం చేసి శ్రీ హరిని  పూజించిన తరువాత ఆహారం, నీరు తీసుకొని ఉపవాసం విరమించాలి.

పుణ్య ఫలాలు ఇవీ..

ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే రోజున ఆహారం, నీరు, బట్టలు, పాదరక్షలు, గొడుగు, పండ్లు మొదలైన వాటిని దానం చేయాలి. ఈ రోజున నీటి కలశాన్ని దానం చేసే భక్తులకు ఏడాది పొడవునా ఏకాదశి ఫలాలు లభిస్తాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల.. ఇతర ఏకాదశులలో భోజనం చేసిన దోషం తొలగిపోయి అన్ని ఏకాదశుల పుణ్యఫలం చేకూరుతుంది. ఈ పవిత్ర ఏకాదశిని నిష్ఠతో ఆచరించేవారు పాపాల నుంచి విముక్తులు అవుతారు.

చేయవలసినవి.. చేయకూడనివి..

1. నిర్జల ఏకాదశి రోజున ఇంట్లో  అన్నం వండకూడదు.
2. ఏకాదశి తిథి నాడు తులసి ఆకులను తీయకండి. అయితే మీరు ఒక రోజు ముందే వాటిని తీసి సిద్ధంగా ఉంచుకోవచ్చు.
3. నిర్జల ఏకాదశి రోజున శారీరక సంబంధాలను నివారించండి.
4. ఈ రోజున ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం సేవించవద్దు.
5. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. కోపం తెచ్చుకోకండి.

నిర్జల ఏకాదశి కథ ఇదీ..  

మహాభారత కాలంలో ఒకసారి భీముడు, మహర్షి వేద వ్యాసుడితో .. ” నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజున  ఉపవాసం ఉండమని నాకు కూడా చెబుతారు. కానీ నేను ఆకలితో ఉండలేను. కాబట్టి దయచేసి నాకు ఆ పుణ్య ఫలం పొందే మార్గం చెప్పండి”  అని అడిగాడు . దీనిపై వేదవ్యాసుడు ఇలా అన్నాడు..  “మీరు నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఆ  రోజు ఆహారం, నీరు రెండూ  తీసుకోవద్దు. ఆ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసంపాటిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలాలను పొందుతావు” అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి నిర్జల ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది.

Telegram Channel

Tags  

  • auspicious time
  • importance
  • method
  • Nirjala Ekadashi
  • Nirjala Ekadashi 2023
  • worship
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Spirituality: మర్రిచెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు.. వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Spirituality: మర్రిచెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు.. వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

సాధారణంగా హిందువులు రక రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. వృక్షాలని దేవతలతో పోలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజలు పూజించే చె

  • Skanda Shasti : ఆ రోజు పూజిస్తే కార్తికేయుడు కరుణిస్తాడు

    Skanda Shasti : ఆ రోజు పూజిస్తే కార్తికేయుడు కరుణిస్తాడు

  • Temple Circling: ఆలయంలో ప్రదక్షణ ఎందుకు చేస్తారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

    Temple Circling: ఆలయంలో ప్రదక్షణ ఎందుకు చేస్తారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు? శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..

    Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు? శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..

  • Mathura Meenakshi Temple: మధుర మీనాక్షి ఆలయ మహత్యం గురించి తెలుసా మీకు..?

    Mathura Meenakshi Temple: మధుర మీనాక్షి ఆలయ మహత్యం గురించి తెలుసా మీకు..?

Latest News

  • Evening Walk : సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

  • Allu Arjun : బన్నీ ఆ సినిమా చేస్తున్నప్పుడు చికెన్ తినకుండా ఉన్నాడట.. ఏ మూవీ తెలుసా?

  • Krishna : ఎన్టీఆర్ నుంచి కృష్ణకు చేరిన కథ.. కట్ చేస్తే చరిత్ర సృష్టించింది.. ఆ సినిమా ఏంటో తెలుసా?

  • WTC Final 2023: అశ్విన్‌ ‘క్యారమ్ బాల్’ నేర్చుకుంటున్న టాడ్ మర్ఫీ

  • Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version