Thursday: అప్పు తీసుకొని బాకీలు ఎంతకీ చెల్లించడం లేదా.. అయితే గురువారం రోజు ఈ పనులు చేయాల్సిందే!
అప్పు తీసుకున్న వాళ్లు డబ్బు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా, అయితే గురువారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే వాళ్లే డబ్బు తీసుకొని వచ్చి ఇస్తారట.
- By Anshu Published Date - 01:34 PM, Fri - 14 February 25

మామూలుగా చాలామంది అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇతరుల అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇస్తూ ఉంటాం. అయితే అవసరం తీరిపోగానే చాలామంది డబ్బును మరిచిపోయి ఇస్తాంలే మళ్లీ ఇస్తాం అన్నట్టుగా మాట దాటేస్తూ ఉంటారు.
అప్పు తీసుకున్న వారు ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అంటూ కాలం వెల్లదీస్తారు. అలా అప్పు వసూలు చేయడం కష్టంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా గురువారం రోజు కొన్ని పనులు చేస్తే బాకీలు త్వరగా వసూలు అవుతాయట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
గురువారం రోజు సూర్యాస్తమయానికి గంట ముందు రావి, మర్రి, వేప చెట్లలో ఏదో ఒక వృక్షం దగ్గర చీమలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో ఒక కిలో చక్కెర పోయాలట. ఇలా మూడు గురు వారాలు చేస్తే మొండి బాకీల సమస్య నుంచి బయటపడతారని, రావాల్సిన డబ్బు చేతికి వస్తుందని చెబుతున్నారు. అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా మొండి బకాయిల సమస్యలు తొలగిపోతాయట. 41 రోజుల పాటు ప్రతిరోజూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 12 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందట. గురువారం రోజున దగ్గరలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి రకరకాల పూలు కలిసిన పూల దండలను స్వామి వారికి అలకరించి పూజ చేయించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందట.
ఈ విధంగా మూడు గురువారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని, మీకు రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుందని చెబుతున్నారు. అలాగే ప్రతి ఆదివారం గుమ్మం ముందు దీపం పెట్టినా మొండి బకాయిల సమస్య తీరుతుందట. ఆదివారం సాయంత్రం గుమ్మం ముందు ఆవు నెయ్యి, ఆముదం కలిపి దీపాలు వెలిగిస్తే మంచిదట. మొండి బాకీలు వసూలు కావాలంటే దేవాలయ ప్రాంగణంలో దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. రావాల్సిన డబ్బులు చేతికొస్తాయని చెబుతున్నారు. శివాలయంలో కాలభైరవుడిని దర్శించుకున్న మంచి జరుగుతుందని చెబుతున్నారు.