Ganesh Statue: గణపతి విగ్రహం కొనేముందు ఇవి తప్పనిసరి
వినాయకచవితి వస్తుందంటే ఊరువాడా సంబరాలు చేసుకుంటారు. గల్లీకో గణపతిని ప్రతిష్టించి తొమ్మిది రోజులు భక్తితో పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు,
- By Praveen Aluthuru Published Date - 10:17 PM, Sat - 12 August 23
Ganesh Statue: వినాయక చవితి వస్తుందంటే ఊరువాడా సంబరాలు చేసుకుంటారు. గల్లీకో గణపతిని ప్రతిష్టించి తొమ్మిది రోజులు భక్తితో పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు, పూజలు, చివరి రోజు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. నిమజ్జనం రోజున భక్తితో పూజించి తల్లి గంగమ్మ చెంతకు చేరుస్తారు. అయితే గణపతి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విగ్నేశ్వరుడు తుండం అందర్నీ ఆకట్టుకుంటుంది. చాటచెవులు, ఎలుక వాహనం ఇలా ప్రతి విషయంలో తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.
వినాయక విగ్రహానికి తొండం కుడి వైపుకు ఉంటె లక్ష్మీ గణపతిగా వర్ణిస్తారు. తొండం ఎడమ వైపు తిరిగి ఉండే విగ్రహాన్నే కొనకూడదని పునీతులు చెప్తున్నారు. తొండము లోపలి వైపుకు ఉంటె తపో గణపతి అని పిలుస్తారు. అదేవిధంగా తొండం ముందుకు ఉన్న గణపతిని పూజించకూడదని పెద్దలు అంటుంటారు. గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. తూర్పుదిశలో కాని, పశ్చిమ దిశలోకాని గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. స్నానాల గదికి అనుకుని ఉన్నగోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయక విగ్రహాన్ని పెట్టుకోవాలి. వినాయకుడి ముందు భాగం సిరి సంపదలు కురిపిస్తుంది. వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుడి వెనుక ముఖం మీ ఇంటి బయటద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.
Also Read: Dalit Farmer: దళిత రైతును కట్టేసి కొట్టిన రెడ్డి