Dream: కలలో మీకు పదేపదే పిల్లి కనిపిస్తోందా.. దేనికి సంకేతమో తెలుసా?
కలలో పిల్లి కనిపించడం అన్నది అనేక విషయాలకు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.n
- By Anshu Published Date - 04:30 PM, Sun - 3 November 24

నిద్రపోతున్నప్పుడు మనకు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని పీడకలలు. చాలామంది పీడ కలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. అలాగే మనకు కలలో రకరకాల వస్తువులు మనుషులు జంతువులు, పక్షులు ఇలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు కలలో అప్పుడప్పుడు పిల్లి కూడా కనిపిస్తూ ఉంటుంది. పిల్లి మనిషి పెంచుకునే జంతువులలో ఒకటి. దీనిని చాలామంది ఇష్టంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. పిల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
అంటే కలలో పిల్లిని చూస్తే డబ్బుకు సంబంధించింది. కొన్నిసార్లు కలలో పిల్లిని చూస్తే అశుభంగా కూడా భావిస్తారు. కానీ కలలో తెల్లపిల్లిని చూస్తే ఆకస్మిక డబ్బు రాకకు సంకేతంగా భావించాలట. ఇది అదృష్టానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. పిల్లి గురించి కలలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. మీరు విద్యార్థులు అయితే పిల్లి కల వస్తే కాస్త కష్టపడితే పరీక్షల్లో విజయం సాధిస్తారట. అంతేకాదు కలలో పిల్లిని చూడటం ఇంకో సంకేతం కూడా ఉందట.
అదేమిటంటే మీరు త్వరలో మీ బంధువులు లేదా స్నేహితులను కలవబోతున్నట్లు అర్థం అని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. కలలో రెండు పిల్లులు కనిపిస్తే అది చెడు సంకేతంగా భావించాలట. ఎందుకంటే రెండు పిల్లులు పోట్లాడుతున్నట్లు కనిపిస్తే మీరు కూడా ఎవరితోనైనా వైరం పెంచుకోబోతున్నట్లు సంకేతం. అంతేకాదు కలలో ఒకేవిధంగా ఉండే రెండు పిల్లులను చూస్తే అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం. మీ బంధంలో చీలిక రావచ్చని అర్థం అంటున్నారు.