Basil Leaves: సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను ఎందుకు కోయకూడదు.. కోస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తాకడం, కోయడం లాంటివి అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:34 PM, Mon - 10 February 25

హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా భావించడంతోపాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కను దైవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కలు శ్రీమహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని తులసి మొక్కను పూజించడం వల్ల వారి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్మకం. హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదేమో. అయితే చాలామంది దేవుళ్ళ పూజలో తులసి ఆకును వినియోగిస్తూ ఉంటారు.
అందుకే తులసి ఆకును కోస్తూ ఉంటారు. తులసి ఆకును కోయడం మంచిదే కానీ ఇప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు కోయకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం నీరు సమర్పించడం కోయడం లాంటివి చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క ఆకులు ఎందుకు కోయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతి రూపంగా కొలుస్తారు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని అందుకే తులసి దళాలు సమర్పిస్తే ఆ శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతి అని అంటారు. తులసిని ప్రతి రోజూ పూజిస్తే ఆర్థిక సంబంధ సమస్యలు తీరతాయట. అంతేకాకుండా నిత్య తులసి దగ్గర దీపం వెలిగించి పూజించే వారికి సంతోషం, ఐశ్వర్యం చేకూరతాయని నమ్మకం. తులసి మొక్క నుండి తులసి దళాలను కోయాల్సి వస్తే సూర్యాస్తమయం లోపే కోసుకోవాలని చెబుతున్నారు.
కొందరు తెలిసీ తెలియక లేదా సాయంత్రం పూజకు కావాలి అనే ఆలోచనతో సూర్యా స్తమయం తర్వాత కూడా తులసి దళాలు కోస్తుంటారు. కానీ అలా తులసి దళాలు సూర్యా స్తమయం తరువాత కోసే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు నెలకుంటాయట. సూర్యాస్తమయం తరువాత తులసి దళాలు కోస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుందట. అంతేకాదు శ్రీమన్నారాయణుడు కూడా ఆగ్రహిస్తాడని చెబుతున్నారు. దీనివల్ల మనిషి జీవితంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయట. క్రమంగా వారి ఆర్థిక స్థితి కూడా దిగజారుతుందట. సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కోసేవారికి కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయట. ఇతరులతో సంబంధాలు క్షీణిస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క ఆకులను కోయకూడదట. అలా కోస్తే వారి పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని చెబుతున్నారు. అందుకే సూర్యాస్తమయం తరువాత తులసి దళాలు కోయరాదు.ఇది మాత్రమే కాకుండా ఏకాదశి, రాత్రి సమయం, అమావాస్య,సూర్య, చంద్ర గ్రహణాల కాలంలో కూడా తులసి ఆకులను మొక్క నుండి కోయకూడదు.