HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >What Are The Best Remedies To Get Success In Works As Per Astrology

Success: ఏదైనా పని మొదలు పెట్టేముందు పసుపుతో ఇలా చేస్తే చాలు.. పనిపూర్తవ్వడం ఖాయం!

ఏదైనా పని మొదలు పెడుతున్నారా, అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవ్వాలి అంటే పసుపుతో ఇలా చేయాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 13-02-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Success
Success

మామూలుగా మనము కొన్ని కొన్ని సార్లు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఏదో ఒక రకంగా అడ్డంకులు ఏర్పడి ఆటంకాలు వచ్చి ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏవో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. దాంతో చాలామంది నిరాశపడుతూ ఉంటారు.. ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పాటిస్తే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కూడా అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

మనం ఏ పని ప్రారంభించినా, అందులో విజయం సాధించడానికి, ఆటంకాలు తొలగిపోవడానికి పసుపు పరిహారం పాటిస్తే మంచిదట. పని మొదలు పెట్టేముందు 3 పసుపు పొట్లాలను వెంట తీసుకెళ్లాలట. అంటే కొంచెం పసుపును పేపర్​ లో పొట్లం లాగా చుట్టుకోవాలి. అలా మూడు పసుపు పొట్లాలు సిద్ధం చేసుకోవాలట. మొదటి పొట్లాన్ని దగ్గరలోని ఏదైనా దేవాలయంలో ఉంచాలి. రెండో పొట్లాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదలాలి. మూడో పొట్లాన్ని మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలట. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుందట. పని పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న పసుపు పొట్లాన్ని మర్రి లేదా రావి లేదా వేప చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి రావాలని చెబుతున్నారు.

అలాగే ఏదైన ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు అది పూర్తిగా సక్సెస్​ కావాలంటే 14 మిరియాలను తీసుకుని గడప బయటి వైపు 7 ఉంచి, గడప లోపలి వైపు మిగిలిన 7 మిరియాలు ఉంచాలట. ఆ తర్వాత వాటిని దాటి బయటికి వెళ్లాలట. మీరు బయటికి వెళ్లిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని ఇంట్లో ఉన్నవారికి చెప్పాలట. ఇలా చేయడం వల్ల చేసే కార్యంలో విజయం లభిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • success
  • turmeric
  • works

Related News

Venu Swamy Prediction on Vijay

Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd