Bath: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే!
స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Sun - 6 October 24

మామూలుగా మనలో చాలామంది స్నానం చేసిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం గా కొన్ని రకాల నియమాలను పాటించకపోతే అది అనేక రకాల సమస్యలకు దారితీస్తుందట. మరి స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు మిగల్చకూడదట. ఎవరైనా మీరు మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
అది మీకు అంత మంచిది కాదట. అలాగే వాళ్లకి కూడా మంచిది కాదని, ఇద్దరికీ దురదృష్టాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా వివాహమైన స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోకూడదట. అలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. తల ఆరిన తర్వాత మాత్రమే కుంకుమ బొట్టు పెట్టుకోవాలని చెబుతున్నారు. అలాగే స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించకూడదట. స్నానానికి ముందు మాత్రమే గోర్లు కత్తిరించడం లాంటివి చేయాలనీ చెబుతున్నారు. అలాగే స్నానం చేసిన తర్వాత బాత్రూంలో తడి బట్టలు అస్సలు ఉంచకూడదట.
ఇలాచేయటం వల్ల ఇంట్లో సూర్యుని స్థానం బలహీన పడుతుందని చెబుతున్నారు. స్నానం చేసిన తరువాత బాత్రూం ని నీట్ గా, పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలట. మీ బాత్రూం ఏ మాత్రం గజిబిజిగా లేదా అపరిశుభ్రంగా ఉన్నా ఆర్థికంగా చాలా నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే స్నానం చేసి నేరుగా వెళ్లి అగ్నిని తాకకూడదట. ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్లాలట. అలాగే స్నానం అయిన వెంటనే బకెట్ ని ఖాళీగా ఉంచకుండా శుభ్రమైన నీటిని నింపి ఉంచాలట. అయితే అలా వీలుకాని పక్షంలో ఆ బకెట్ ని బోర్లించాలని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వాస్తు, గ్రహదోషాల నుంచి తప్పించుకోవచ్చట.