Vastu Tips: ఎలాంటి వాస్తు దోషాలు ఉండకూడదంటే ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలను పెంచుకోవాలో తెలుసా?
ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు అనుకుంటే ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలను పెంచు కోవాలి అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:03 AM, Thu - 10 April 25

మాములుగా మనం వాస్తు ప్రకారం ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాము. అందులో కొన్ని రకాల మొక్కలు మనకు ఆర్థికంగా మానసికంగా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా వాస్తు దోషాల సమస్యల నుంచి కూడా బయటపడేస్తాడట. అందుకే ఇంటిని నిర్మించే విషయంలో వాస్తు నియమాలను కూడా పాటించాలని చెబుతుంటారు. మీ ఇంట్లో, చుట్టుపక్కల శుభ్రమైన, స్వచ్ఛమైన గాలి ఉంటే, వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఇది ఆరోగ్యానికి,అలాగే వాస్తు ప్రకారం కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇకపోతే మన ఇంటి ఆవరణ ప్రాంతంలో కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇంటికి దగ్గర ఎలాంటి మొక్కలు పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అశోక చెట్టు – మీరు మీ ఇంటికి ఉత్తర దిశలో అశోక చెట్టును నాటడం వల్ల అది శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ అశోక చెట్టు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుందని చెబుతున్నారు.
అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో అరటి మొక్క కూడా ఒకటి. అరటి చెట్టును కూడా శుభప్రదంగా భావిస్తారు. హిందువులు ప్రతి గురువారం రోజు మొక్కను పూజిస్తూ ఉంటారు. ఈ అరటి మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో నాటడం వల్ల మంచి జరుగుతుందట. తులసి చెట్లు నాటితే మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయట.
కొబ్బరి చెట్టు.. మీ ఇంటి సరిహద్దులో కొబ్బరి చెట్లను నాటడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇది ఇంట్లో నివసించే వ్యక్తి గౌరవాన్ని పెంచుతుందట. అలాగే ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట.
మర్రి చెట్టు.. మర్రి చెట్టును కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీ ఇంటికి తూర్పు దిశలో ఈ చెట్టును నాటితే, మీ కోరికలన్నీ నెరవేరుతాయట. అయితే ఈ చెట్టు నీడ మీ ఇంటిపై పడకూడదని గుర్తుంచుకోవాలి. ఈ చెట్టును ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ చెట్టుని కొంచెం దూరంగా నడవడం మంచిది.
ఉసిరి చెట్టు.. వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండాల్సిన మొక్కలలో ఉసిరి మొక్క కూడా ఒకటి. ఈ చెట్టు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ చెట్టు మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందట. అంతేకాదు ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు.