Vastu Tips : ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టారా..? ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? లేదంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..!!
వాస్తుప్రకారం...ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం మంచిది. ఇంట్లో సంతోషాన్ని, శ్రేయస్సును అందించడంలో సహాయపడుతుంది.
- By hashtagu Published Date - 08:00 PM, Sun - 28 August 22
వాస్తుప్రకారం…ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం మంచిది. ఇంట్లో సంతోషాన్ని, శ్రేయస్సును అందించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని రుణమిముక్తులను చేయడంతోపాటు…లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో తప్పకుండా మనీ ప్లాంట్ పెంచుకోండి. కానీ ఈ మొక్క ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ మొక్కను పెంచడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాస్తుప్రకారం…ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం తెలుసుకుందాం.
నేలను తాకకూడదు:
ఈ మొక్క భూమితో ఎలాంటి సంబంధం లేకుండానే పెరుగుతుంది. మనీ ప్లాంట్ తీగలు ఎట్టిపరిస్థితుల్లోనూ నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాటిని తీగలుగా పైనకు పెరిగేలా చూడండి. కొమ్మలకు తాడు సాయంతో కట్టాలి. తీగలు పెరుగుతుంటే…వాస్తుప్రకారం శ్రేయస్సు పెరుగుదులకు చిహ్నంగా భావిస్తారు. మనీ ప్లాంట్ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తుంటారు. ఈ మొక్క ఎంత పెరిగితే…వ్యక్తి అభివ్రుద్ధి కూడా ఆ విధంగా ఉంటుందని చెబుతుంటారు. అందుకే మనీ ప్లాంట్ తీగలు ఎట్టిపరిస్థితుల్లోనూ నేలను తాకకూడదని శాస్త్రం చెబుతోంది.
ఎండిన మనీప్లాంట్:
వాస్తుశాస్త్రంప్రకారం….ఎండిపోయిన మనీప్లాంట్…వినాశనానికి సంకేతం. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. మనీ ప్లాంట్ ఎండిపోకుండా తరచుగా నీరు పెట్టండి. ఆకులు ఎండిపోతున్నట్లయితే…వాటిని తొలగించండి.
ఈదిశలో నాటకండి:
మనీప్లాంట్ ఈశాన్య దిశలో నాటకూడదు. వాస్తప్రకారం..ఈ దిశలో మనీ ప్లాంట్ నాటినట్లయితే ఆర్ధిక నష్టం వాటిల్లుతుంది. అంతేకాదు ఇల్లు ప్రతికూలంగా మారుతుంది. మనీప్లాంట్ ను ఆగ్నేయ దిశలో నాటాలి. ఆగ్నేయ దిశలో గణేశుడు ఉంటాడు కాబట్టి శ్రేయస్సును సూచించడంతోపాటు గణేశుని అనుగ్రహం లభిస్తుంది.
ఎవరికీ ఇవ్వకూడదు:
వాస్తుప్రకారం మనీప్లాంట్ ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీ సంపద మరొకరి వశమౌతుంది.
ఇంట్లో మాత్రమే ఉంచాలి:
మనీప్లాంట్ ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంచుకోవాలి. దీనికి సూర్యరశ్మి అవసరం లేదు. ఇంటి బయట మనీ ప్లాంట్ ను నాటడం వాస్తుప్రకారం అశుభం. ఎండలో ఇది త్వరగా ఎండిపోతోంది. పెరగుదల మందగించి ఇంటికి దురదృష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థికఇబ్బందులకు కారణం అవుతుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.