Vasthu Tips: మనీ ప్లాంట్ తో పాటు ఈ మొక్కలు కూడా ఇంట్లో ఉంటే చాలు కాసుల వర్షం కురవాల్సిందే?
మామూలుగా చాలా మంది ఇంట్లో బయట ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ
- By Nakshatra Published Date - 06:30 PM, Fri - 19 January 24
మామూలుగా చాలా మంది ఇంట్లో బయట ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని, ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు తలెత్తని చాలామంది భావిస్తారు. అయితే ఒక మనీ ప్లాంట్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం పట్టిపీడించినట్టే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే కేవలం మని ప్లాంట్ మొక్క మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనీ ప్లాంట్ ను వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఈ మొక్క పేరుకు దగ్గట్టుగానే మీ సంపదను పెంచుతుంది. కొన్ని రకాల మొక్కలను, చెట్లును ఇంటిదగ్గర నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి కుటుంబ ఆనందాన్ని, ప్రశాంతతను కాపాడుతాయని చెప్తారు. అయితే ఇంట్లో మొక్కలు, చెట్లు నాటేటప్పుడుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దీంతో మీకు అంతా మంచే జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో సానుకూలతను పెంచడానికి తులసిని ఎంతో పవిత్రమైన, శుభప్రదమైన మొక్కగా భావిస్తారు. తులసి మొక్కకు ధార్మిక ప్రాముఖ్యతతో పాటుగా వాస్తులో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను మీ ఇంటి ఆవరణ, బాల్కనీ లేదా కిటికీల దగ్గర తులసి మొక్కను పెట్టవచ్చు.
అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. వెదురు మొక్క కూడా అదృష్టంతో ముడిపడి ఉంది. వెదురు మొక్కలో 5, 6 లేదా 7 కాండాలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క అదృష్టాన్ని కూడా పెంచుతుంది. వెదురు మొక్కను ఇంటి తూర్పు మూలలో పెట్టడం చాలా మంచిది. అలాగే శివుడి ఆరాధనలో జమ్మి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో జమ్మి చెట్టు ఉండటం వల్ల శివుని అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. అలాగే ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అపరాజిత మొక్కకు కూడా హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మొక్కను మీ ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం మంచిది. ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో ధనం, ధాన్యాలకు కొదవే ఉండదని కూడా నమ్మకం.
Related News
Vasthu Tips: ఈ మొక్కని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెడితే చాలు.. మార్పు మీరే గమనించవచ్చు?
మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా వాటిని ఏ దిశ