Vasthu Tips: ప్రతికూల శక్తులు తొలగిపోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
ఇంట్లో ఉన్న ప్రతి కూల శక్తులు తొలిగిపోవాలంటే అందుకోసం కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 10:00 AM, Wed - 4 September 24
ఎప్పుడైనా బ్యాడ్ టైం నడుస్తుంటే ప్రతికూల శక్తులు వెంటాడుతున్నాయని చెబుతూ ఉంటారు. ఈ ప్రతికూలశక్తులను దూరం చేసుకోవడానికి తొలగించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి నుంచి విముక్తి లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలా ప్రతికూల శక్తులను తొలగించుకోవాలనుకుంటున్నారా, అయితే అందుకోసం కొన్ని పనులు చేయాలంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని ప్రధాన ద్వారం శక్తి ప్రధాన వనరు. ఈ మార్గం గుండానే మంచి, చెడు శక్తులు ప్రయాణిస్తాయి.
మీ ఇంట్లోకి నెగిటివ్ శక్తి రాకుండా ఉండాలంటే, మీ ప్రధాన ద్వారం అతి పెద్దగా ఉండాలి. అలాగే ఇంట్లోని తలుపులను ఎలాంటి శబ్దం లేకుండా పూర్తిగా తెరిచి ఉంచాలి. లోపలి డోర్లను ఎప్పటికీ మూసి ఉంచకూడదట. అలాగే ప్రధాన ద్వారం వద్ద ఎల్లప్పుడు స్వస్తిక్, తోరాణాలు వంటివి అమర్చాలట. దీని వల్ల మనం సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. ఇంటి లోపల అలంకరణ మన శరీరంలో ఉండే రక్తకణాలలో ప్రసరించే శక్తి ఉన్నందున, ఇంటి లోపల అలంకరణ, గాలి కూడా మనపై అదే ప్రభావన్ని చూపుతాయి. సాధారణంగా మన శరీరాన్ని మనం ఎలాగైతే కలుషితం కాకుండా కాపాడుకుంటామో అదేవిధంగా ఇంట్లోని ప్రతి వస్తువులను ఒక క్రమబద్ధంగా ఉంచుకోవాలి. దీని వల్ల మీ ఇంట్లో శక్తి సానుకూలంగా ఉంచేందుకు సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో గాలి నిరంతర కదలిక, తగిన కాంతి వాతావరణంలో నుండి వచ్చే సువాసన ఇంట్లో ముఖ్యమైన శక్తి ఉనికిని సూచిస్తాయట. అలాగే పడకగదిలో మంచానికి చాలా అవినాభవ సంబంధం ఉంటుంది. చాలా మంది ప్రజలు మంచం కింద తయారు చేసిన పెట్టేలో వస్తువులను ఉంచుతారు. చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో లేని వాటిని ఉంచడం వల్ల మీ ఇంట్లో లేని ప్రతికూల శక్తిని మీరు ఆహ్వానిస్తున్నట్లే అవుతుంది. అలా కాకుండా మీరు మంచం కింద గాలి వీచడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో పాత వస్తువులు కానీ లేదంటే పాత బొమ్మలు ఉంటే వాటిపై దుమ్ము పేరుకొని ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. వీలైతే వాటిని శుభ్రంగా ఉంచుకోవడం లేదంటే బయటపారవేయడం లాంటివి చేయాలట.
ఎందుకంటే పాత వస్తువుల వల్ల శక్తి కలుషితం అవుతుందని చెబుతున్నారు. కొందరు ఇంట్లో బూట్లు మరియు చెప్పులను మంచం కింద ఉంచుతారు. ఇది ఇంట్లో వాస్తు లోపాలను సూచిస్తుందట. ఇకపోతే ఇంట్లోకీ సానుకూల శక్తి ప్రవేశించడం కోసం మీరు మీ ఇంటి ఆగ్నేయం లేదా వాయువ్యంలో ఉన్న వంట గది ఇంటికి సానుకూల శక్తిని నింపుతుంది. ఆహారం తయారు చేసేటప్పుడు, ఇంటి లక్ష్మి తన ముఖంతో తూర్పు వైపు ఆహారాన్ని సిద్ధం చేస్తే, మీ ఇంటికి సానుకూల శక్తి ఆ ఆహారం ద్వారా వస్తుంది. అది మీ శరీరంలోకి కలిసిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి కూల శక్తులు తొలగిపోవాలంటే మీ ఇంటి బాల్కనీలో చంపా చెట్టును నాటడం మంచిదని చెబుతున్నారు.
Related News
Spirituality: ఈ పదాలు వాడినా, ఈ పనులు చేసిన లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట!
ఇంట్లో కొన్ని రకాల పదాలను పదేపదే పలకడం కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట.