Vastu Shastra: బాత్రూంలో ఈ ఒక్క మార్పు చేస్తే రాజయోగమే.. అదేంటంటే?
Vastu Tips: చాలామంది ఇంటి పరిశుభ్రత గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇంటి లోపల బయట ఉండే బాత్రూం గురించి అంతగా పట్టించుకోరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, బాత్రూం అన్నిటికంటే ఎక్కువగా ప్రతికూలతలు సృష్టిస్తుంది.
- Author : Anshu
Date : 18-10-2022 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Vastu Tips: చాలామంది ఇంటి పరిశుభ్రత గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇంటి లోపల బయట ఉండే బాత్రూం గురించి అంతగా పట్టించుకోరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, బాత్రూం అన్నిటికంటే ఎక్కువగా ప్రతికూలతలు సృష్టిస్తుంది. దీంతో భారీగా ఆర్థిక నష్టాలు వస్తాయి. కాబట్టి బాత్రూం విషయంలో కూడా కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం వల్ల వాస్తు ప్రకారం గా ఉండే దోషం తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారంగా బాత్రూంలో బ్లూ కలర్ అనగా నీలం రంగు బకెట్ మాత్రమే ఉపయోగించాలి. ఈ కలర్ బకెట్ తప్ప మరే ఇతర బకెట్లను ఉపయోగించకూడదు.
బ్లూ కలర్ ఎందుకు అని అంటే..నీలం రంగు ఉపయోగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెంచే సామర్థ్యం ఈ బ్లూ కలర్ కి ఉంటుంది. అలాగే మనం ఆకాశాన్ని చూసినప్పుడు ఎప్పుడు మనకు మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇందుకు గల కారణం ఆకాశం నీలి రంగులో ఉంటుంది. కాబట్టి బాత్రూంలో బ్లూ కలర్ బకెట్ పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడం మాత్రమే కాకుండా ఆనందం కలిగి మనశ్శాంతిని లభిస్తుంది. అంతేకాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఫలితంగా మనకు రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది అని నిపుణులు చెబుతున్నారు. బ్లూ కలర్ బకెట్ ను ఉపయోగించడంతోపాటు బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
బాత్రూంలో ఎంతసేపు ఉన్నా కూడా మనసుకు ఆనందంగానే అనిపించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాత్రూం డోర్ ని ఎప్పుడు తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే బాత్రూం ఎనర్జీ బెడ్ రూమ్ లో ఎనర్జీ రెండు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఈ రెండు కలిసిపోతే జీవితం అల్లకల్లోలం గంగా గోరంగా మారుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే స్నానం చేసిన తర్వాత ఎప్పుడు బకెట్ ని కాళీగా ఉంచకూడదు. బకెట్ ను ఎప్పుడు మంచి నీటితో నింపాలి. స్నానం చేసిన తర్వాత నీరు ఉండకూడదు అనుకుంటే బకెట్ను బోర్లించాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాల సమస్య ఉండదు.