HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu Tips Combing Your Hair While Sitting In Middle Of The House Ominous Because

Vasthu Tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా.. దరిద్రం ఖాయం!

చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయ

  • By Anshu Published Date - 06:30 PM, Sun - 17 March 24
  • daily-hunt
Mixcollage 17 Mar 2024 06 49 Pm 2434
Mixcollage 17 Mar 2024 06 49 Pm 2434

చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. అలాగే అవి ఆ ఇంటి గృహస్థుల జీవితాల పై ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. చాలా పనులు ఇంట్లో చేయకూడదు అని చెప్పినా అవేవీ లక్ష్య పెట్టకుండా చాలామంది చేస్తూ ఉంటారు. గోళ్ళు కొరకటం, ఇంటి మధ్యలో కూర్చొని జుట్టు దువ్వుకోవడం వంటి అనేక పనులు అనేక నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మహిళలు జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది.

చాలామంది మహిళలు నట్టింట్లో కూర్చొని జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని ఇంట్లో కూడా మన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు. ఇంట్లో జుట్టు విరబోసుకొని మహిళలు ఎప్పుడు పని చేయకూడదు. జుట్టు విరబోసుకొని మహిళలు నిద్రించకూడదు. అంతేకాదు మహిళలు నటింట్లో జుట్టు దువ్వకూడదు. వెంట్రుకలు ఇంట్లో పడటం మన పెద్దవాళ్లు అశుభమని చెబుతూ ఉంటారు. అందుకే జుట్టు దువ్వుకునేటప్పుడు మహిళలు ఆరు బయట గాని, వరండాలో కానీ, ఇంటికి దూరంగా కానీ దువ్వుకోవాలి. వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిదేవుని ఆహ్వానించినట్టేనని, అది ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని చెబుతారు.

జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వచ్చినా కూడా, ఆ పనులు జరగమని ప్రతికూల ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. మంగళవారం జుట్టు విషయంలో ఈ పనులు చెయ్యకండి ఇక మంగళవారం నాడు మహిళలు జుట్టు అస్సలు కత్తిరించుకోకూడదు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, జుట్టు విరబోసుకుని తిరగడం అరిష్టం. మంగళవారం అయితే జుట్టుని ఎక్కువగా కూడా దువ్వకూడదు. మంగళవారం జుట్టు రాలితే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. నటింట్లో కూర్చొని తల దువ్వుకోవడం, నటింట్లో కూర్చొని పేలు చూసుకోవడం వంటివి ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తాయి.

అందుకే మహిళలు ముఖ్యంగా జుట్టు దువ్వుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో వెంట్రుకలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు విరబోసుకుని ఈ పనులు చేసినా ఫలితం శూన్య్యం ఇక ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వకూడదని కూడా సలహా ఇస్తున్నారు. ఊడిపోయిన వెంట్రుకలను ఇంట్లో ఎక్కడా పెట్టకూడదని, వాటిని ఇంటికి దూరంగా పడేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వెంట్రుకలు పడితే అవి తినే ఆహారంలో కూడా పడే ప్రమాదం ఉంటుందని, తద్వారా ఆహారం కలుషితం అవుతుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair
  • house
  • sitting middle
  • Vasthu Tips

Related News

Money Plant

‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

Money ‎Plant: మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అని అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Vasthu Tips

    ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

Latest News

  • ‎Rice: నెలరోజుల పాటు అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Constipation: ‎మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

  • ‎Lemon: కేవలం ఒక్క నిమ్మకాయతో బరువుతో పాటు బాణ లాంటి పొట్టి తగ్గించుకోండిలా!

  • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరిని పూజిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీకమాసం సోమవారం చేసే స్నానం, ఉపవాసం, దీప దానం ఎలాంటి ఫలితాలను అందిస్తాయో మీకు తెలుసా?

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd