Vastu Tips: ధనవంతులు పొరపాటున కూడా వంటగదిలో ఈ 3 వస్తువులను అస్సలు ఉంచరు.. ఎందుకో తెలుసా?
Vastu Tips: పొరపాటున కూడా మన వంట గదిలో మూడు రకాల వస్తువులు అస్సలు ఉంచకూడదని, ఇది దరిద్రంతో పాటు అనేక సమస్యలకు కారణమవుతుందని అందుకే ధనవంతులు ఆ వస్తువులను వంట గదిలో పెట్టరని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 AM, Sun - 5 October 25

Vastu Tips: హిందువులు అనేక విషయాలలో వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే వంటగది విషయంలో కూడా అనేక వాస్తు నియమాలు పాటిస్తుంటారు. వంటగదిని ముఖ్యమైనదిగా భావించడంతో పాటు పూజా మందిరంతో సమానంగా చూస్తారు. అయితే కొందరు వంటగది విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే మరి కొందరు అంతగా పట్టించుకోరు. కొంతమంది ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు. అందుకు గల కారణం అలాంటి వ్యక్తులు తమ జీవితంలో వాస్తు నియమాలను,నమ్మకాలను పాటించడమే.
ఇకపోతే వాస్తు శాస్త్రంలో కూడా వంటింట్లో ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి తెలిపారు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగి ఇంటిలోని సుఖసంతోషాలపై ప్రభావం పడుతుంది. వంట గదిలో ముఖ్యంగా మూడు రకాల వస్తువులను అస్సలు ఉంచకూడదని చెబుతున్నారు. ఇంతకీ అవేంటి అన్న విషయానికి వస్తే.. వంటగదిలో పగిలిన పాత్రలు, కప్పులు, గిన్నెలు లేదా గ్లాసులు వంటివి ఎప్పుడూ ఉంచకూడదట. ఎందుకంటె ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందట. అలాగే వాస్తు దోషాలను పెంచుతుందట. సంపన్న వ్యక్తుల వంటశాలలు శుభ్రంగా ఉండటానికి, పూర్తి పాత్రలను ఉపయోగించడానికి ఇదే కారణం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అలాగే వంటగదిని పూజా మందిరంలా పవిత్రమైన స్థలంగా భావించాలట. అందువల్ల వంటగదిలోకి బూట్లు చెప్పులు వంటివి వేసుకుని వెళ్ళకూడదని చెబుతున్నారు. అలాగే వంట గదిలో మురికి బట్టలు కూడా ఉంచకూడదట. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా పాత ఆహారం లేదా చెడిపోయిన ధాన్యాన్ని వంటగదిలో ఉంచకూడదట. ఇది ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.