Vastu Tips: స్నానం చేసిన ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే అరిష్టమే!
Vastu Tips: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 07:00 AM, Wed - 22 October 25

Vastu Tips: స్నానం చేసిన ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే అరిష్టమే!
Vastu Tips: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.
Vastu Tips: స్నానం చేసిన తరువాత పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. స్నానం చేసిన తర్వాత చేసే తప్పులు ఆరోగ్యంపైనే కాకుండా ఇంటి శక్తి , వాస్తుపై కూడా ప్రభావం చూపుతాయట. మరి ఇంతకీ స్నానం చేసిన తరువాత ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్ లో మురికి నీటిని అలాగే వదిలేస్తారు. ఇలా నీరు నిల్వ ఉంచడం అన్నది అశుభంగా పరిగణిస్తారట. ఇది రాహువు, కేతువుల ఆగ్రహానిరి గురి చేస్తుందని, ఇంట్లో పేదరికాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.
అందువల్ల, స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ బకెట్ ను శుభ్రం చేసి, అందులో తాజాగా నీరు నింపాలట. మురికి నీటిని దాచి ఉంచకుండా వంపేయాలట. తలకు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును బాత్‌రూమ్ లోనే వదిలేయడం వల్ల మురికిగా ఉండటమే కాకుండా, ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తుందట. ఇలా చేయడం వల్ల శని, కుజుడు అసంతృప్తి చెందుతారట. అందుకే ప్రతిసారీ స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్ ను శుభ్రం చేసుకోవాలని,ఊడిన జుట్టుని బాత్రూమ్ లో వదిలేయకుండా వెంటనే తీసివేయాలని పండితులు చెబుతున్నారు. చాలా మంది స్నానం చేసిన వెంటనే తడి బట్టలను బాత్‌రూమ్ లోనే వదిలేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యం,వాస్తు రెండింటికీ హానికరం.
తడి బట్టలు బ్యాక్టీరియా ఫంగస్ కు కారణమవుతాయట. కాబట్టి బట్టలను వెంటనే ఎండలో లేదా గాలిలో ఆరబెట్టడం మంచిదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకోవడం మంచిది కాదట. ఈ సమయంలో శరీరం మనస్సు స్థిరపడటానికి సమయం పడుతుందట. తొందరపడి సింధూరం పెట్టుకోవడం వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. అది భర్త ఆయుష్షుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవడం కూడా మంచిది కాదట. ఈ అలవాటు శారీరకంగా ప్రమాదకరమే కాకుండా, సానుకూల శక్తిని కూడా పోగొట్టేస్తుందని, పరిశుభ్రత,భద్రత కోసం చెప్పులు లేకుండా స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు.
స్నానం చేసిన తర్వాత తలుపు మూసి ఉంచడం వల్ల లోపల తేమ ఏర్పడుతుందట. ఇది ఫంగస్, బూజుకు కారణమవుతుందట. ఈ తేమ గోడలను పాడు చేయడమే కాకుండా చర్మం శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.