Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు.
- By Pasha Published Date - 10:38 AM, Thu - 17 October 24

Valmiki Jayanti 2024 : ఇవాళ (అక్టోబరు 17) మహర్షి వాల్మీకి జయంతి. రామాయణాన్ని రచించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుంది. రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకిని ఆదికవిగా పిలుస్తుంటారు. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కాషాయవస్త్రాలు ధరించి శోభాయాత్రలు నిర్వహిస్తుంటారు. రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు. ఏపీ ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని ఇటీవలే రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈరోజు అన్ని జిల్లాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
Also Read :Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ
- వాల్మీకి మహర్షి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలు లేవు.
- కశ్యపుడు – అదితి కుమారుల్లో ఒకరైన వరుణ్ – చార్సి దంపతులకు వాల్మీకి జన్మించారని చెబుతుంటారు.
- వాల్మీకి బ్రహ్మ అంశలో పుట్టారని అంటారు.
- వాల్మీకి దారి దోపిడీలు చేస్తూ, జంతువులను వేటాడి వధించేవారని అంటారు. నారదమహర్షి బోధనలు విన్న తర్వాత ఆయన రామనామం జపిస్తూ ఏళ్ల తరబడి తపస్సు చేశారని చెబుతారు.
- ఏళ్ల తరబడి అడవిలో ఒకేచోట తపస్సులో కూర్చోవడంతో వాల్మీకి చుట్టూ పుట్టలు పెరిగాయి. పుట్టలను వల్మీకం అంటారు. అలా పెరిగిన పుట్టల నుంచి బయటకు వచ్చినందు వల్ల ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చిందట.
- రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి ప్రస్తావించారు.
- రావణ సంహారం తర్వాత సీత, లక్ష్మణుడితో కలిసి శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకుంటాడు. రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ సమయంలో రాజ్యంలో కొందరు ప్రజలు లంకలో ఉండి వచ్చిన సీతను రామయ్య ఏలుకుంటున్నాడని మాట్లాడుతారు. ఆ సంగతి తెలిసిన రాముడు సీతమ్మను అడవిలో విడిచిపెట్టి రమ్మని సోదరుడిని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమయంలో సీతమ్మకు అడవిలో ఆశ్రయం ఇచ్చింది వాల్మీకి మహర్షినే. లవకుశులు అక్కడే జన్మిస్తారు.