Tulsi Roots: ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏమవుతుందో మీకు తెలుసా?
ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:30 AM, Thu - 22 May 25

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటుగా పూజలు చేస్తూ ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఆవరణలో తులసి మొక్క పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులసి మొక్క ఇంటి వద్ద ఉండటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా తులసి దేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తులసి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతుంటారు.
ఏ ఇంట అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇకపోతే వాస్తు శాస్త్ర ప్రకారం తులసి మొక్క వేరును ఇంటి ప్రధాన ద్వారానికి కడితే సంపద పెరుగుతుందట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటుందని, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెబుతున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి తులసి వివరణ కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయట. తులసి మొక్క ఎండిపోయిన తర్వాత దాని వేర్లను తొలగించాలి.. ఆ తులసి వేరును గుప్పెడు బియ్యం, ఎర్రటి వస్త్రంలో వేసి కట్టి దారంతో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలని చెబుతున్నారు.
వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగిస్తుందట. దీని కోసం మీరు తులసి మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిక్కులో ఉంచాలని పండితులు చెబుతున్నారు. తులసి మొక్క వేర్లు ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ శక్తులు ప్రవేశించట. అలాగే తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు.