TTD : 2024 లో తిరుమల హుండీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
TTD : మొత్తం ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం (Hundi donations amounting to Rs. 1,365 crore) వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.
- By Sudheer Published Date - 01:09 PM, Thu - 2 January 25

ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్లో ఒకటి తిరుమల(Tirumala)..ఇది ఎవరైనా చెపుతారు. నిత్యం ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని (Tirumala Srivaru) దర్శించుకొని కానుకలు సమర్పించుకుంటుంటారు. పదుల దగ్గరి నుండి కోట్ల రూపాయిల వరకు కూడా భక్తులు హుండీలో వేసి శ్రీవారిపై తమకు ఉన్న భక్తిని , నమ్మకాన్ని రుజువు చేసుకుంటున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి హుండీ ఆదాయ వివరాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (Tirumala Tirupati Devasthanams (TTD) ) తాజాగా వెల్లడించింది. మొత్తం ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం (Hundi donations amounting to Rs. 1,365 crore) వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. ఇది భక్తుల విశ్వాసానికి, భక్తి పరాకాష్టకు నిదర్శనంగా నిలిచింది.
YCP Comments : ‘కక్షే’ ఉంటె జగన్ ఇంతసేపా..? – చంద్రబాబు
2.55 కోట్లు దర్శనార్థులు :
2024లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2.55 కోట్లుగా నమోదైంది. ఈ సంఖ్య తిరుమల దేవస్థానం ప్రాముఖ్యతను మరోసారి చాటిచెబుతోంది. భక్తుల ఈ భారీ సందర్శన పుణ్యక్షేత్రం మహిమను దృఢంగా సూచిస్తోంది.
తలనీలాలు, అన్నప్రసాదం :
2024లో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 99 లక్షలు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 6.30 కోట్లుగా ఉంది. తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తులు తమ పుణ్యాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీనివాసుడి ఆశీస్సులు పొందుతున్నారు.
లడ్డూ విక్రయాలు :
2024లో తిరుమలలో విక్రయించిన లడ్డూల సంఖ్య 12.14 కోట్లు. తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ భక్తుల నమ్మకానికి ఒక ముఖ్యమైన ప్రతీక. ఈ లెక్కలు భక్తుల శ్రద్ధ, నమ్మకానికి సూచికగా నిలిచాయి.
Liquor Sales Record : తెలంగాణ సర్కార్ కు ‘కిక్’ ఇచ్చిన న్యూ ఇయర్