Alum: పటిక బెల్లంతో ఈ విధంగా చేస్తే చాలు ఇక కాసుల వర్షమే?
సాధారణంగా చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగడం లేదని ఆర్థిక సమస్యలు
- By Anshu Published Date - 06:00 AM, Wed - 14 December 22

సాధారణంగా చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగడం లేదని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి లేకుండా, ఖర్చులు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే అటువంటి వాటికోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల చిట్కాలను చెప్పబడిన విషయం తెలిసిందే. చిట్కాలతో పాటు పరిహారాలను కూడా తెలిపారు. మరి ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే, ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పట్టిక బెల్లం ను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి దేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం శాంతి కలుగుతాయి. పటిక బెల్లాన్ని ఆరోగ్య సంపదగా పరిగణిస్తారు. కొద్దిపాటి పటిక బెల్లం తో ఎన్నో రకాల రోగాలు నయం అవుతాయి. పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు పరిహారాలు చేయడం వల్ల ఒత్తిడి సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే చాలామంది ఇళ్లలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దాంతో మనశ్శాంతి లేకుండా టెన్షన్ కి ఒత్తిడి లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు ఒక గిన్నెలో పటికను తీసుకొని ఇంట్లో ఏదైనా ఒక మూలల్లో ఉంచాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుముఖం పట్టడంతో పాటు వాతావరణం ప్రశాంతంగా ఉండి మనశ్శాంతిగా ఉంటారు. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు నింపి అందులో కొంచెం పట్టిక బెల్లాన్ని వేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఒక గిన్నెలో 50 గ్రామాలు పటిక బెల్లాన్నీ వేసి ఇంటి పూజగదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలా చేయటం వల్ల ఇంట్లో గొడవలు సమస్యలు అన్ని తగ్గిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.