Vastu Tips: బాత్రూంలో ఉప్పు ఉంచడం వల్ల కలిగే లాభాలు ఇవే?
వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి పాజిటివ్ ని పెంచడంలో ఉప్పు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యం
- By Nakshatra Published Date - 09:07 PM, Fri - 28 July 23
వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి పాజిటివ్ ని పెంచడంలో ఉప్పు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాస్తు దోషాలను తొలగించడంలో ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇది అందుకే ఉప్పును ప్రధాన ముఖద్వారం వద్ద అలాగే ఇంట్లో కొన్ని మూలల్లో ఉంచమని వాస్తు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అలాగే బాత్రూంలో కూడా ఉప్పుని ఉంచడం మంచిది అంటున్నారు నిపుణులు. వాస్తు ప్రకారం, బాత్రూంలో ఒక గాజు గిన్నెలో రాతి ఉప్పును ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోతుంది.
ఉప్పునీటిలో స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. బాత్ రూమ్ లో గాజు పాత్రలో ఉప్పు ఉంచితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. దీంతో ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. ఇది వాతావరణాన్ని శుద్ధిచేసి లక్ష్మీదేవిని పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఉప్పు ద్రావణం ఇంటికి దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే ఇంటి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఒక గ్లాస్ టంబ్లర్లో నీటిని నింపి ఉప్పు కలపి దానిని బాత్రూమ్ నైరుతి మూలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. బాత్రూమ్కు సంబంధించిన వాస్తు దోషాన్ని తొలగించడానికి ఒక ఇత్తడి గిన్నెలో క్రిస్టల్ సాల్ట్ ఉంచండి. ఈ గిన్నె ఎక్కడ ఉన్నా ఎవరూ తాకకూడదు. అలాగే ఎప్పటికప్పుడు ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. రాళ్ల ఉప్పుతో టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి రాకుండా చేస్తుంది. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చాలి. మంగళవారం లేదా శనివారం బాత్రూంలో ఉప్పు ఉంచడం మంచిది. మంగళవారం హనుమంతుని పేరుతో బాత్రూమ్లో ఉప్పు ఉంచడం వల్ల హనుమంతుడు ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తి నుండి కాపాడుతుంది. మరోవైపు, శనివారం నాడు శని నామాన్ని ఆరాధిస్తూ బాత్రూంలో ఉప్పు ఉంచడం వల్ల శనిని ప్రసన్నం చేసుకుంటుంది. తద్వారా ప్రతికూల శక్తి మీ ఇంటికి రాకుండా చేస్తుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.