Trigrahi Yoga : ఈనెలలో త్రిగ్రాహి యోగం.. ఆ మూడు రాశుల వారికి రాజయోగం
ప్రత్యేకించి వీరికి చెందిన ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- By Pasha Published Date - 04:55 PM, Tue - 3 September 24
Trigrahi Yoga : సెప్టెంబరు నెలలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏర్పడినప్పుడు బుధుడు, శుక్రుడు ఎదురెదురుగా వస్తారు. వీటితో పాటు కుజుడు కూడా అదే అమరికలో చేరుతాడు. బుధుడు, శుక్రుడు, కుజుడు ఈవిధంగా ఒక అమరికలోకి రావడం వల్ల మూడు రాశులవారికి రాజయోగం దక్కుతుంది. త్రిగ్రాహి యోగం వల్ల ఆయా రాశులవారిలో క్రియేటివిటీ పెరుగుతుంది.ఉద్యోగం, వ్యాపారం, విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. అదృష్టం కలిసొచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
- తులారాశి వారు త్రిగ్రాహి యోగంతో(Trigrahi Yoga) శుభఫలితాలను అందుకుంటారు. ప్రత్యేకించి వీరికి చెందిన ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న పలువురికి ప్రమోషన్లు లభిస్తాయి. మ్యారేజీ లైఫ్ మరింత హ్యాపీగా ముందుకు సాగుతుంది. పెళ్లి కాని వారికి మ్యారేజ్ సెట్ అవుతుంది. కుజుడు – బుధుడి కలయిక వల్ల తులా రాశివారికి చాలా మంచిఫలితాలు చేకూరుతాయి.
Also Read :IIT Bombay : 25 శాతం ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు నో ప్లేస్‌మెంట్స్
- ధనస్సు రాశి వారు త్రిగ్రాహి యోగంతో అనూహ్య ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యక్తిగత జీవితంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. ఉన్నత విద్యను చదువుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదువుతున్న వారు బంపర్ ఆఫర్లను దక్కించుకుంటారు.
Also Read :Anti Rape Bill : యాంటీ రేప్ బిల్లు ‘అపరాజిత’ను ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ
- కుంభరాశి వారు త్రిగ్రాహి యోగంతో కెరీర్‌లో ఎంతో పురోగమిస్తారు. అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్లు లాభాల బాటలోకి వస్తారు. అయితే సరైన ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహం ఉంటేనే ఈ లాభాలు సొంతమవుతాయి. వ్యక్తిగత జీవితాల్లో ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. పార్ట్‌నర్‌షిప్‌లో బిజినెస్ చేసే వాళ్లు మంచి పురోగతిని సాధిస్తారు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.
Related News
Dream Effect: మీకు కలలో ఇవి కనిపించాయా.. అయితే రాజయోగం పట్టినట్టే?
కలలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.