HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Today Engili Pula Bathukamma What Flowers Are Used In It

Engili Pula Bathukamma: ఎంగిలిపూల బతుకమ్మలో ఎలాంటి పూలు వాడాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలో తెలుసా?

బతుకమ్మ సంబరాలలో పాటించాల్సిన విధి విధానాల గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 03-10-2024 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Engili Pula Bathukamma
Engili Pula Bathukamma

రెండు తెలుగు రాష్ట్రాలలో నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా మొదలయ్యాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు అందరూ ఆడిపాడే సమయం వచ్చేసింది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలుకానున్నాయి. పల్లెల్లో ఆడవాళ్ళు ముందు రోజే పూలు సేకరించి పెట్టుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ అని చెప్పాలి. ఈ బతుకమ్మను రకరకాల పువ్వులతో, రంగురంగుల పువ్వులతో ఎన్నో అందంగా ఎత్తుగా అలంకరిస్తూ ఉంటారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మార్కెట్లన్నీ రంగు రంగుల పూలతో నిండిపోయాయి.

సిటీలో పూలు కావాలంటే కొనుక్కోవాల్సిందే. మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటారు. గునుగు, తంగేడు, చామంతి, బంతి వంటి పూలతో ఎంగిలి పూల బతుకమ్మ పేరుస్తారు. ఈ రోజు కోసం ముందు రోజే పూలు కోసి పెట్టుకుని నీళ్ళలో వేసి ఉంచుకుంటారు. అవి నిద్ర చేశాయని అంటారు. అది మాత్రమే కాకుండా పూల కాడలను నోటితో తెంచుతారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం. అందుకే ఈ రోజు జరుపుకునే పండుగకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చింది. ఉదయం వేళ ఇంట్లోని మగవాళ్ళు తమ పూర్వీకులకు శ్రద్ధ ఖర్మలు నిర్వహించుకుంటారు. మధ్యాహ్నం సమయానికి వాటిని ముగించుకుని ఇంటికి చేరుకుని భోజనాధి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇక ఆడవాళ్ళు సాయంత్రం వేళ అందంగా ముస్తాబు అయి బతుకమ్మను తయారు చేసుకుంటారు. తమలపాకులు, తులసి ఆకులను మహిళలు ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు.

బియ్యం పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, గ్రామీణ జీవన విధాన్ని ప్రతిబింబించే విధంగా పండుగ జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడతారు. మొదటిరోజు ఎంగిలి బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు అంటే దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే భేదం లేకుండా అందరూ కలిసి మెలిసి ఆనందంగా జరుపుకుంటూఉంటారు.

ఆరో రోజు తప్ప మిగతా అన్ని రోజులు రకరకాల నైవేద్యాలు తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు అలిగిందని అంటారు. అందుకే బతుకమ్మ తయారు చేయరు, ఎలాంటి సంబరాలు జరుపుకోరు. ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసి దాని చుట్టూ చిన్న బతుకమ్మలు ఉంచుతారు. ఆడవాళ్ళు వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం పారే నీళ్ళలో పోయిరావే బతుకమ్మ అంటూ సాగనంపుతారు. ఈ విధంగా తెలంగాణలో దాదాపు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma
  • dusserha
  • Engili Pula Bathukamma
  • telangana

Related News

Komatireddy

Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

మంత్రి కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధి

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Latest News

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd