Lady Aghori Naga Sadhu : అఘోరి నాగ సాధు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా..?
Lady Aghori Naga Sadhu : సనాతన ధర్మ పరిరక్షణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్న అఘోరీకి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్దమవుతున్నారట
- By Sudheer Published Date - 07:04 PM, Tue - 5 November 24

గత కొద్దీ రోజులుగా మహిళా అఘోరి నాగ సాధు (Naga Sadhu) కు ప్రాణ హాని ఉందా..? నాగ సాధు ను ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారా..? నాగ సాధు పై దాడికి ప్లాన్ చేస్తున్నారా..? నాగ సాధు వు..అసలు అఘోరీనే కాదనే ఆరోపణలు చేయబోతున్నారా..? అసలు ఎందుకు నాగ సాధు ను టార్గెట్ చేయబోతున్నారు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ కలవరపెడుతున్నాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ లోని ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ అఘోరాని నాగ సాధు ఆశ్చర్యపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేస్తుంది.
మాములుగా అఘోరాలు (Aghoralu) హిమాలయాల్లో..కాశీలో ఎక్కువగా దర్శనం ఇస్తుంటారు. ఒంటిమీద ఎలాంటి దుస్తులు లేకుండా..మొత్తం విబూది తో ఉంటారు. శ్మశానాలలో ..పాడుబడ్డ భవనాలలో జీవించటం, పూజలు, ప్రాణాయమాలు, తపస్సులు నిర్వహించటం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి, ఒళ్ళంతా రాసుకోవటం, పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో (కుక్క వంటి) జంతువులకు కూడా ఆహారదానం చేయటం, పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం, శవాలతో సంభోగించటం వంటివి చేస్తుంటారు. ఇది మనకు తెలిసింది..కానీ ఈ మహిళా అఘోరి (Naga Sadhu)..మాత్రం ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ ..సనాతన ధర్మం కోసం పోరాటాం చేసేందుకు సిద్ధమని, సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తూ అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగ సాధు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈమె ఎటు వెళ్తుంది..? ఏమిచేస్తుంది..? అంటూ ఆరాతీస్తూ వస్తున్నారు. అఘోరీ కారు కనిపిస్తే చాలు, అక్కడ ఆమె భక్తులు ప్రత్యక్షం కావడం, ఆశీస్సులు పొందడం పరిపాటిగా మారింది. అందుకే పోలీసులు కూడా బందోబస్తు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సోమవారం విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఆమెకు కొన్ని అసభ్యకర సంఘటనలు ఎదురయ్యాయని పేర్కొంది. అక్కడ టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనలో ఆమె ధర్మ రక్షణ గురించి తన ఆవేదనను, ప్రస్తుత సమాజం కలియుగంలో ఎలా మారిపోయిందనే తన అభిప్రాయాన్ని తెలిపింది. టోల్‌గేట్ వద్ద అఘోరిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ ఆన్ లైన్ ద్వారా కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్న అఘోరీకి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్దమవుతున్నారట. అలాగే అఘోరీ మాతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కూడా భాద్యత వహించాలని ఆమె భక్తులు కోరుతున్నారు. మరి ఈ పిటిషన్ పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Read Also : Graduates MLC Elections : ప్రభుత్వ పదవులు వదులుకొని ..రాజకీయాల్లోకి రావడం అవసరమా..?