HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >These Things Make Shani Dev Angry And These Can Make Happy 2

Shani Dev: పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి.. చేశారంటే శని ఆగ్రహానికి గురవ్వాల్సిందే?

మామూలుగా శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాల

  • Author : Anshu Date : 27-12-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 27 Dec 2023 04 25 Pm 1948
Mixcollage 27 Dec 2023 04 25 Pm 1948

మామూలుగా శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలు చెడు పనులు చేసే వారికి చెడ్డ ఫలితాలను ఇవ్వడంతో పాటు వారికి అష్ట కష్టాలను అనుభవించేలా చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అందుకే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని చెబుతూ ఉంటారు. చెడు పనులు చేసే వారిని శని దేవుడు తప్పకుండా శిక్షిస్తూ ఉంటాడు. అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల శని దేవుని ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. మరి ఎలాంటి పొరపాట్లు చేస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడు సూర్య పుత్రుడు.

శని కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. సూర్య పుత్రుడైన మరో దేవత యమ ధర్మరాజు. యముడు మృత్యుదేవత. మరణానంతరం వారి సద్గతులను నిర్ణయిస్తాడు. శనిని ప్రసన్నం చేసుకున్న వారు తమ లక్ష్యాలను ఛేదిస్తారని నమ్మకం. శని కరుణ పొందాలంటే కొన్ని పనులు తప్పక చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పనులు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడితే మరికొన్ని పనులు చెయ్యడం వల్ల శనికి కోపం రావచ్చు. ఎలాంటి పనులు చేయవద్దు అన్న విషయానికి వస్తే.. బాత్ రూములు మురికిగా పెట్టుకోవద్దు. కాస్త మురికిగా అయినా సరే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే శని ఆగ్రహానికి గురికావల్సి రావచ్చు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మురికిగా వదిలెయ్యడం కూడా అసలు చెయ్యకూడదు.

పెద్దవారిని, నిస్సహాయులను ఎప్పుడూ అవమానించరాదు. అగౌరవ పరచకూడదు. ఇలా చేస్తే శని వేసే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. చేసిన అప్పు ఉద్దేశ్య పూర్వకంగా తీర్చకపోతే మీరు శని కోపానికి గురికావల్సి వస్తుంది. రుణం తీసుకున్న వారు వీలైనంత త్వరగా దాన్ని తీర్చుకోవడం మంచిది. కుర్చిలో కూర్చుని పాదాలు ఊపే అలవాటు కూడా మంచిది కాదు. ఇలా కూర్చుని అవసరం లేకుండా పాదాలు కదిపే అలవాటు అసలు మంచిది కాదు. ఈ చర్య జీవితాన్ని ఉద్రిక్త పరిచేందుకు కారణం అవుతుంది. పాదాలు ఈడుస్తూ నడవడం అసలు మంచిది కాదు. ఇలా నడిచే వారిని శని అసలు వదిలిపెట్టడు. ఇలా చేస్తే తప్పనిసరిగా పూర్తవుతాయని అనిపించే పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. రకరకాలుగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతాయి. అలాగే రాత్రి తిన్న తర్వాత వంట గదిలో ఎంగిలి పాత్రలు వదిలెయ్యడం అంత మంచిది కాదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. లేదంటే వాటిని కడిగేందుకు బయట పెట్టుకోవాలి. ఎంగిలి పాత్రలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే సరిచేసుకోవడం అవసరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Happy
  • lord shani dev
  • shani dev
  • Shani Dev angry

Related News

Lord Shani

Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

సూర్యనారాయణ, ఛాయాదేవి దంపతుల కుమారుడైన శనీశ్వరుడి గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. శనీశ్వరుడు వైశాఖమాసం అమావాస్య రోజున జన్మించాడు. ఇక ఆయన జయంతి రోజున ఆయనను ప్రత్యేకంగా పూజించి ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆయన అనుగ్రహం కలిగితే అప్పులు, రకరకాల వ్యాధులు, అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చట. శని జయంతి

  • Shani Jayanti 2026

    Shani Jayanti 2026: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందట..!

Latest News

  • Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

  • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd