Lord Shani: మనం తరచూ ఉపయోగించే ఈ పదాలు శని దేవుడికి విపరీతంగా కోపం తెప్పిస్తాయని మీకు తెలుసా?
Lord Shani: మనం ధైనందిన జీవితంలో తరచుగా ఉపయోగించే ఒక నాలుగు పదాలు శనీశ్వరుడికి విపరీతంగా కోపం తెప్పిస్తాయట. ఇంతకీ ఆ పదాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sun - 12 October 25

Lord Shani: నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు. శనీశ్వరుడికి మనపై కోపం వస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత పేదవాడు అయినా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే ఆయన ఆగ్రహిస్తే ఎంతటి కోటీశ్వరులు అయిన బిచ్చగాడిలా మారాల్సిందే. కొన్ని కొన్ని సార్లు శనీశ్వరుడి అనుగ్రహం కలిగినా కూడా మనం మాట్లాడే కొన్ని పదాల కారణంగా ఆయనకు విపరీతమైన కోపం వస్తుందట. ఇంతకీ ఆ పదాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామూలుగా ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేసుకోవడం అన్నది సహజం. అలా చేసిన సహాయాన్ని ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి. నువ్వు ఎవరి నుంచి అయినా సరే సహాయం పొందితే నలుగురికి చెప్పుకోవచ్చు కానీ,మనం చేసిన సహాయాన్ని నలుగురికి చెప్పుకోకూడదని చెబుతున్నారు. ఇలా చెప్పుకోవడం వల్ల సహాయం పొందిన వారికి ఇబ్బంది కలిగించవచ్చట. ఆల్రెడీ బాధలో ఉన్నవారు మరింత బాధపడే అవకాశం ఉంటుందని, దీని వల్ల మీరు చేసిన దానికి కూడా విలువ ఉండదని, కాబట్టి సహాయం చేసినా కూడా గొప్పలు చెప్పుకోకూడదని, ఈ అలవాటు శని దేవుడికి అస్సలు నచ్చదని చెబుతున్నారు.
అలాగే ఏదైనా విజయం సాధించినప్పుడు, అది నా వల్లే జరిగింది అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీ శ్రమ లేకుండా ఆ విజయానికి క్రెడిట్ తీసుకోవడాన్ని శని దేవుడు హర్షించడట. పైగా శిక్షించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే అహంకారపు మాటలను శని అస్సలు సహించడట వేరొకరి శ్రమకు తాము క్రెడిట్ తీసుకునేవారిపై శని కన్నెర్ర చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే మంచి మంచి అలవాట్లతో నడుచుకునే వారిపై శని దేవుడి దయ ఎప్పుడు ఉంటుందట. కానీ కొంతమంది ఎటువంటి సద్గుణాలు లేకుండా తాము దేవునికి ఇష్టమైన కుమారులమని చెప్తూ తిరుగుతూ ఉంటారు.
అలా అని అందరికీ చెప్పి నమ్మిస్తారు. కానీ శని అలాంటి మాటలను ఎప్పుడూ క్షమించడట. దేవుని దయ పొందడానికి, ఒకరు సంసిద్ధత , సద్గుణాలను కలిగి ఉండాలని చెబుతున్నారు. మనుషులు తప్పులు చేయడం సహజం. కానీ వాటిని సరిదిద్దుకుని జీవితాన్ని గడపాలట. కానీ కొంతమంది తమ తప్పులను గ్రహించకుండా లేదా తమ తప్పుల గురించి తెలుసుకోకుండా జీవిస్తారు. వారు చేసే అన్ని చెడు పనులను దేవుడు క్షమిస్తాడనే మనస్తత్వంలో ఉంటారు. అంతేకాకుండా వారు పదే పదే అదే మాట చెబుతూ ఉంటారు. కొంతమంది ఏ దేవుడు వచ్చినా అతను నన్ను ఏమీ చేయలేడు అని అంటారు. అలాంటి మాటలు కూడా శనికి విపరీతమైన కోపం వచ్చేస్తుందట. కాబట్టి ఈ మాటలు పొరపాటున కూడా మాట్లాడకూడదని పండితులు చెబుతున్నారు.