HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >These Are The Remedies To Be Performed For The Leo Zodiac Sign In 2026

2026లో సింహ రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Author : Vamsi Chowdary Korata Date : 01-01-2026 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Simham
Simham

జ్యోతిష్యం ప్రకారం, సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కొత్త ఏడాది 2026లో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహ రాశి నుంచి కేతువు లగ్న స్థానంలో, శని అష్టమ స్థానంలో గురుడు పదకొండో స్థానాల్లో సంచారం చేయనున్నారు. జూన్ 2 తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ప్రవేశించనున్నాడు. కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ రాశి నుంచి పంచమ, ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సింహ రాశి వారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితి..

సింహ రాశి వారికి కొత్త ఏడాది 2026లో కుజుడు లాభ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కొన్ని శుభ యోగాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

కెరీర్ పరంగా..

​కొత్త ఏడాది 2026లో సింహరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి సూర్యుడు దశమ, పదకొండో స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు మంచి విజయాలు సాధిస్తారు. జూన్ 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దశమ, పదకొండో స్థానాల్లో కుజుడి సంచారం సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. అష్టమ స్థానంలో శని విపరీత రాజయోగం ఏర్పరచటంతో మీ కెరీర్ బలోపేతం అవుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

వ్యాపార పరంగా..

సింహ రాశి వారికి కొత్త ఏడాది 2026లో కుజుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. సప్తమ స్థానంలోరాహువు సంచారం చేసే సమయంలో మీ వ్యాపారం ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ప్రణాళిక, గోపత్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో రియల్ ఎస్టేట్, ఆస్తి, ఆటోమొబైల్స్, నిర్మాణం, మార్కెటింగ్, పరిశోధన వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలుక కలగనున్నాయి. మీ వ్యాపారాన్ని ఆన్‌లైన్ లేదా విదేశాలలో కనెక్ట్ చేసుకుంటే, మీరు ఆకస్మిక, గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది.

విద్యా జీవితంలో..

సింహ రాశి వారికి కొత్త ఏడాది 2026లో సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభవార్తలు వినిపిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తాము చదివే కోర్సుల్లో బలమైన పట్టు కలిగి ఉంటారు. ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు సూర్యుడు లాభ స్థానంలో ఉంటాడు.

ఆరోగ్య పరంగా..

సింహ రాశి వారికి కొత్త ఏడాది 2026లో సూర్యుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకానున్నాయి. సప్తమ స్థానంలో సూర్యుడు, రాహువు కలయిక కారణంా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

వివాహం, ప్రేమ జీవితంలో..

సింహ రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహువు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో వివాహం, ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జూన్ 2 వరకు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. గురుడు పన్నెండో స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రేమ, వైవాహిక, కుటుంబంలో ఆహ్లాదకరమైన మార్పులకు అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు సంయమనం పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు.

ఏ పరిహారాలు పాటించాలంటే..

* సింహ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.
* ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాలను పఠించాలి.
* మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి.
* సూర్య మంత్రాలను జపించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, సానుకూల శక్తులు లభిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • horoscope
  • leo
  • new year
  • simharashi
  • Yearly Prediction 2026
  • yearly rasi phalalu

Related News

Venu Swamy Prediction on Vijay

Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

  • Ganesh Trsha

    Tamil Nadu Election Results 2026 : త్రిష కోరిక నెరవేరిందంటూ బండ్ల గణేశ్ ట్వీట్

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd