HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >These Are The Remedies To Be Performed For The Aries Zodiac Sign In 2026

2026లో మేష రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Author : Vamsi Chowdary Korata Date : 01-01-2026 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mesharashi
Mesharashi

జ్యోతిష్యం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మేష రాశి నుంచి రెండో స్థానంలో, గురుడు మూడో స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు పంచమ స్థానం నుంచి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు తొమ్మిదో స్థానాల నుంచి సంచారం చేయనున్నారు. రాహువు పదకొండో స్థానంలో, శని దేవుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడే సతి సమయంలో ఈ రాశి వారికి కొన్నిప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితి..

​మేష రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో, సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తొచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కెరీర్ పరంగా..

​కొత్త ఏడాది 2026లో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పని చేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా, పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివర్లో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

వ్యాపార పరంగా..

మేష రాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి. అయితే మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికీ డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే, కచ్చితంగా మంచి విజయం సాధిస్తారు.

విద్యా జీవితంలో..

మేష రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యా రంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావొచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.

ఆరోగ్య పరంగా..

మేష రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. దీని వల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి చివర్లో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదురుకావొచ్చు. కాబట్టీ ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురు గ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

వివాహం, ప్రేమ జీవితంలో..

మేష రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. మరోవైపు మొదటి మూడు నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది.

ఏ పరిహారాలు పాటించాలంటే..

* మేష రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.
* మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి.
* ‘‘ఓం హ్రాం హనుమతే నమః’’ అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి.
* మంగళవారం కుజుడి, శనివారం రోజున శని మంత్రాలను జపించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aries
  • horoscope
  • Mesharashi
  • new year
  • Yearly Prediction 2026

Related News

Dhanu

2026లో ధనుస్సురాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ధనస్సు రాశి వారికి కెరీర్, వ్యాపారం, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం, ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి మేథస్సు, ఆదాయం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాడు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇదిలా ఉండగా కొత్త ఏడాది

  • Vrishchika

    2026లో వృశ్చికరాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Tula

    2026లో తులా రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Kanya.

    2026లో కన్య రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Simham

    2026లో సింహ రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

Latest News

  • న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • వొడాఫోన్‌-ఐడియాకు ఊరట: ఏజీఆర్‌ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం

  • ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు: బఫర్‌ జోన్‌ విస్తరణకు పుతిన్‌ ఆదేశాలు

  • ఉదయం వేళ హెర్బల్ టీ: ఆరోగ్యానికి సహజ వరం

  • 2026లో కర్కాటక రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

Trending News

    • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

    • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

    • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

    • జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

    • ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్ష‌లు త‌ప్ప‌వు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd