Tulsi Plant: ప్రతిరోజు సాయంత్రం తులసి కోట వద్ద ఈ దీపం పెడితే చాలు.. అదృష్టంతో దశ తిరగడం ఖాయం!
Tulsi Plant: ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేయడం మాత్రమే కాకుండా సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఇప్పుడు చెప్పే దీపం పెడితే చాలు అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.
- Author : Anshu
Date : 10-12-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Tulsi Plant: హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కను లక్ష్మీ దేవతగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కలు లక్ష్మీదేవితో పాటు విష్ణువు కూడా కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. ఏ ఇంట అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ శక్తులు ప్రవేశించవని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా, ఇది ఇంటి పరిసరాలను కూడా శుద్ధి చేస్తుందట. దీని వలన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని, అన్ని విధాల కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాగా లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా తులసి విష్ణువుకు కూడా చాలా ప్రియమైనది అని అందరి నమ్మకం. అందువలన ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన ఇద్దరి ఆశీర్వాదాలు ఇంటిపై ఉండటమే కాకుండా, అదృష్టం కూడా వరిస్తుందట.
ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందట. ఇది ఒత్తిడిని దూరం చేస్తుందని అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్క వద్ద ప్రతి రోజూ దీపం వెలిగించడం వలన ఇంటిలో సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయట. మరీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు. అంతే కాకుండా అప్పుల సమస్యలతో సతమతం అయ్యే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారని చెబుతున్నారు.