Hanuman Pooja: ఎలాంటి పనులు చేసిన ఆటంకాలు ఎదురవుతున్నాయా.. అయితే ఆంజనేయస్వామిని ఇలా పూజించాల్సిందే!
తరచూ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్నవారు,ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పినట్టు ఆంజనేయస్వామిని పూజిస్తే చాలు అని చెబుతున్నారు పండితులు.
- Author : Anshu
Date : 23-05-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా శుభకార్యాలు అనుకున్నప్పుడు కొంతమందికి తిరచూ ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మనం చేసే పనులు విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఆంజనేయ స్వామిని పూజించే విధానంలో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించడం వల్ల మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయట.
మరి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే.. ప్రతిరోజు ఆంజనేయస్వామి చాలీసాను 11 సార్లు చదవాలి. ఈ విధంగా హనుమాన్ చాలీసా చదువుతున్న సమయంలో తిరుగుతూ చదవకుండా ఒకే ఆసనంపై కూర్చోవాలట. పక్కకు లేకుండా హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవడం పూర్తి చేసి చివరిలో శ్రీరామరక్ష స్తోత్రం చదవాలట. ఇలా మంగళవారం, శనివారం ఒక పూట ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయట. ఇక మంగళవారం లేదా స్వామి వారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను సమర్పించడం ఎంతో ముఖ్యం.
ఇక ఇంట్లో ఆటంకాలు ఎదురవుతాయి అని భావించేవారు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ కూడా హనుమాన్ చాలీసాలు చదివి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిదట. ఈ విధంగా మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనం చేసే పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదరవకుండా పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెబుతున్నారు. ఇక వీలైతే మన ఆర్థిక స్తోమతను బట్టి నెలకు ఒకసారి అయినా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం ఎంతో మంచిదట.