HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >The Number Three Has A Close Relationship With Lord Shiva What Is The Secret

Lord Shiva : ‘3’ సంఖ్యతో పరమశివుడికి ప్రత్యేక అనుబంధం!

3 సంఖ్యతో శివ భగవానుడికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆ సంఖ్య చాలా శుభప్రదమైనదని అంటారు.

  • Author : Pasha Date : 08-07-2024 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Shiva Number 3

Lord Shiva : 3 సంఖ్యతో శివ భగవానుడికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆ సంఖ్య చాలా శుభప్రదమైనదని అంటారు. ఇంతకీ 3 సంఖ్యకు.. శివ భగవానుడికి(Lord Shiva) ఉన్న అనుబంధం ఏమిటి ? మహా దేవుడి ఏయే అంశాల్లో 3 అంకె మనకు పరోక్షంగా తారసపడుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

త్రినేత్రం

శివుడు త్రినేత్రుడు. ఆయనకు 3 నేత్రాలు ఉంటాయి. భూమిపై పాపాలు పెరిగిపోయినప్పుడు శివుడు తన మూడో కన్నును తెరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. శివుడు మూడో కన్నును తెరవగానే  మహా ప్రళయం వచ్చి సమస్త భూమండలం లయం అవుతుందని చెబుతారు.

త్రిశూలం 

శివుడి చేతిలో నిత్యం ఉండే ఆయుధం త్రిశూలం. ఇందులోని మూడు అంచులు.. ఆకాశం, భూమి, పాతాళానికి ప్రతీకలు అని చెబుతుంటారు.

త్రిపుండ్రాలు

త్రిపుండ్రాలు అంటే మహాశివుడి నుదుటిపై విభూతితో ఉండే మూడు గీతలు. వీటిని దర్శిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, అభివృద్ధి లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

Also Read :Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు

త్రిపురారి

శివ పురాణం ప్రకారం.. పూర్వం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను నిర్మించుకొని ప్రజలను ఇబ్బందిపెట్టారు. రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు. ఈ మూడు నగరాలు ఎప్పుడూ గాలిలో ఎగురుతూనే ఉండేవి. రాక్షసులు భూమిపై భీభత్సం సృష్టించి వచ్చి ఈ త్రిపుర నగరాల్లో దాక్కునేవారు. ఈ రాక్షసుల కారణంగా దేవతలు కూడా ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. రాక్షసులతో వేగలేక దేవతలు, మానవులు కలిసి శివుడిని ఆశ్రయించారు. దీంతో మహేశ్వరుడు రాక్షసులతో యుద్ధం చేశాడు. భూమిని రథంగా చేసుకొని.. సూర్యచంద్రులను  రథానికి చక్రాలుగా మార్చుకున్నాడు. ఆదిశేషుడిని విల్లుగా, శ్రీ మహావిష్ణువును ధనుస్సుగా చేసుకున్నాడు. ఈ రథంతో మంధర పర్వతాన్ని ఎక్కిన పరమేశ్వరుడు..  ఒక రోజు మూడు నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చిన టైంలో బాణం వేసి మూడు నగరాలను, రాక్షసులను సంహరించాడు.

ఏకబిల్వం శివార్పణమ్

శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం.  మారేడు దళంలో మూడు ఆకులు(Number 3) ఉంటాయి. మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉంటుందని అంటారు.

Also Read :Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lord Shiva
  • Number 3
  • Number Three

Related News

    Latest News

    • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది .. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

    • Hyderabad : ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే మహిళల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd