Lord Shiva: ఈ ఒక్క పువ్వుతో శివుడిని పూజిస్తే చాలు.. సమస్యలన్నీ మాటుమాయం?
భారతదేశంలో ఉన్న ప్రజలు అలాగే హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం
- By Anshu Published Date - 08:00 PM, Sun - 30 July 23

భారతదేశంలో ఉన్న ప్రజలు అలాగే హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా కూడా మనకు శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనం ఇస్తూ ఉంటాడు. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటుగా, స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూలతో కూడా పూజిస్తూ ఉంటాడు.. వాటితో పాటు ఒక పువ్వుతో శివుని పూజించడం వల్ల కోరికలు నెరవేయడంతో పాటు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. శివుడికి ఎంతో ఇష్టమైన ఆ పుష్పాన్ని పెట్టి పూజించడం వల్ల సమస్త దొషాలు హరిస్తాయి.
కైలాసవాసుడికి ఎంతో ఇష్టమైన పువ్వుగా ఇది చెబుతారు. ఆ పువ్వు మరేదో కాదు ఉమ్మెత్త పువ్వు. ఈ పువ్వుని, చెట్టుని మనం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం.. అయితే ఆ పువ్వుని శివుడి దగ్గర పెట్టి వేడుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కేరళ లోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి అని అక్కడ బాగా నమ్ముతారు. ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే చాలా ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే దారిద్ర్యం తొలగిపోతుందట. నవరాత్రి రోజుల్లో ఏడవరోజు సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
సరస్వతీ దేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలి వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయట. ప్రదోష కాలంలో శివుడిని అర్చిస్తేజాతక దోషాలు తొలగిపోతాయి. సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోషంలో శివుడిని అర్చించాలట. మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. ఆ సమయంలో శివునిని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. సాయంత్రం ఆరు గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేకూరుతుంది.
శివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రాలు, కొబ్బరి బోండం నీటితో అభిషేకం చేయిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది.